సౌత్ స్టార్ హీరోలకు ఉన్న బ్యాడ్ హాబిట్స్ ఏంటో తెలుసా..?

ఒక వ్యక్తికి ఉన్న అలవాట్లే వారి వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. అవి మంచివా? చెడువా? అనేది అప్రస్తుతం. అందుకే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అంటారు పెద్దలు. పలువురు సెలబ్రిటీలు కూడా తమకున్న చెడు అలవాట్లను వదిలి.. మంచి అలవాట్లను మెరుగు పర్చుకోవాలి అనుకుంటారు. తాము చెడు అలవాట్లు కలిగి ఉండటం మూలంగా తమ అభిమానులు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంటుంది అనుకుంటారు. అందుకే చాలా జాగ్రత్తగగా వ్యవహిరస్తారు. అయితే చాలా మంది హీరోలకు సైతం కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. కానీ నిజ జీవితంలో తను చాలా సింపుల్ గా ఉంటాడు. ఈయకు సిగరెట్ తాగడం అనేది పెద్ద బ్యాడ్ హాబిట్. ఇప్పటికే తను ఈ విషయాన్ని చాలా సార్లు వెల్లడించాడు కూడా. సిగరెట్ మూలంగా తాను చాలా ఇబ్బందులు పడ్డట్లు వెల్లడించాడు. ఇప్పటికీ తను సిగరెట్ తాడుతాడు. మానేయడానికి ప్రయత్నించిన కుదరడం లేదంటాడు రజనీ. అల్లు అర్జున్ కూడా సిగరెట్ స్మోక్ చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం ఎంత అనేది మాత్రం ఇప్పటికీ తెలియదు. అటు విజయ్ దేవరకొండ కూడా సిగరెట్ కాల్చేవాడట. ప్రస్తుతం మానేసినట్లు తెలుస్తోంది.

అటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రస్తుతం ఎలాంటి బ్యాడ్ హాబిట్స్ లేవు. కానీ ఒకప్పుడు తనకు కూడా ఉండేవట. కానీ ఆ వార్తలు ఎంత వరకు వాస్తవమో తెలియదు. అటు కోలీవుడ్ హీరో దళపతి విజయ్ రాష్ డ్రైవింగ్ అనేది బ్యాడ్ హాబిట్. ఇప్పటికే ఆయన మీద ర్యాష్ డ్రైవింగ్ పేరిట పలు కేసులున్నాయి. అటు సూర్యకు బట్టలు మార్చడం అనే అలవాటు ఉంది. రోజుకు పది రకాల బట్టలు మారుస్తాడట. ధనుష్ శాకాహారి. అయితే విదేశాలకు వెళ్లినప్పుడు ఈయనకు చాలా ఇబ్బంది కలుగుతుందట. అక్కడ వెజ్ ఫుడ్ దొరక్క అవస్తలు పడిన సందర్భాలు చాలా ఉన్నట్లు వెల్లడించాడు.