త్రిబుల్ ఆర్‌కు స‌వాల్ విసురుతోన్న ప‌వ‌న్‌.. ఇదేం ట్విస్ట్ బాబు…!

పవర్ స్టార్ అనే పేరే ఒక పండగ. అలాంటిది ఆయన సినిమా వస్తోందంటే డబల్ బొనాంజా అన‌డంలో సందేహం లేదు. అజ్ఞాత‌వాసి త‌ర్వాత ప‌వ‌న్ గ‌తేడాది వ‌కీల్‌సాబ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఈ యేడాది భీమ్లానాయ‌క్ సినిమాతో గ‌త నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా రీమేక్‌లే. బాలీవుడ్‌లో హిట్ అయిన అమితాబ్ పింక్ సినిమాకు రీమేక్‌గా వ‌కీల్‌సాబ్ వ‌చ్చింది. ఇక మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ‌ప్ప‌నుం కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయ‌క్ వ‌చ్చింది.

ప‌వ‌న్ వ‌రుస‌గా రీమేక్ సినిమాలు చేస్తూ ఉండ‌డం ఫ్యాన్స్‌కు కాస్త డిజ‌ప్పాయింట్‌గా మారింది. ఇక ప‌వ‌న్ ఈ నెల 25న వ‌స్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ భీమ్లానాయ‌క్‌కు స‌వాల్ విసిరేందుకు రెడీ అవుతున్నాడు. ప‌వ‌న్ భీమ్లానాయ‌క్ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌లో ఈ నెల 25న స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. అదే రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయ సినిమా ప్రేమికులు అంద‌రూ ఎంతో ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తోన్న త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అవుతోంది.

మ‌రి ప‌వ‌న్ భీమ్లానాయ‌క్ ఓటీటీలో ఏవైనా రికార్డులు బ్రేక్ చేయాల‌న్నా.. 24 గంట‌లు, 48 గంట‌లు, వారం రోజుల్లో ఎక్కువ వ్యూస్ రాబ‌ట్టాల‌న్నా అది ఓపెన్ డే రోజు స్ట్రీమింగ్ చేసుకుని ఉంటే బాగుండేది. అయితే ప‌ని క‌ట్టుకుని త్రిబుల్ ఆర్ రిలీజ్ రోజునే భీమ్లానాయ‌క్ స్ట్రీమింగ్‌కు వ‌స్తుండ‌డం సినిమా వ‌ర్గాల్లో సైతం ఆశ్చ‌ర్యంగా మారింది. ఆ రోజు సోష‌ల్ మీడియా అటెన్ష‌న్‌, మీడియా టెన్ష‌న్‌.. ఇటు సినీ ల‌వ‌ర్స్ అటెన్ష‌న్ అంతా త్రిబుల్ ఆర్ మీదే ఉంటుంది.

ఇక సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ప‌వ‌న్ వేసిన రోల్ భీమ్లా నాయక్ ని ఢీకొనే పాత్రలో యువ కథానాయకుడు రానా తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. మ‌రి వెండితెర‌పై చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేక‌పోయిన ఈ సినిమా బుల్లితెర మీద ఏం చేస్తుందో ? చూడాలి.