ఇదేం ప్రమోషన్స్ రా మావా..కండోమ్ కంపెనీ పై RRR..!!

ఈ మధ్య కాలం లో మనం ఎక్కువ గమనించిన్నట్లైతే..ఏదైన సినిమా హిట్ అయితే..ఆ సినిమా పేరు ని సీరియల్స్ పేరుకి వాడుకుంటున్నారు. అలాగే హోటల్స్ కి కూడా ఆ పేరు పెట్టుకుని జనాలని అట్రాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా పేరు ద్వారా పాపులర్ అవచ్చు,,ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని వాళ్ల నమ్మకం. అలా చేసి సక్సెస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. మొన్న ఆ మధ్య రిలీజ్ అయిన బాలయ్య సెన్సేషనల్ మూవీ “అఖండ” పేరు మీద ఫుడ్ హోటల్స్ ఓపెన్ చేసి మంచి పాపులారిటీని దక్కించుకున్నారు.

ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన “రాధే శ్యామ్” సినిమా రిలీజ్ కి ముందు..ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని..సజ్జనార్ TSRTC కి ప్రమోషన్స్ కి ఉపయోగించుకున్నారు. RTC ప్రయాణం నే సేఫ్ అంటూ ప్రభాస్ పూజా పై అద్దిరిపోయే మీమ్ క్రియేట్ చేసారు. ఇక ఇప్పుడు RRR వంతు వచ్చింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా RRR మానియా నడుస్తుంది. ఎక్కడ చూసిన ..ఏ phone లో caller tune విన్నా .. RRR కి సంబంధించినవే ఉంటున్నాయి. ఇక RRR పేరు ని ఉపయోగించి..కొన్ని హోటెల్స్..మెకానిక్ షాప్స్ ఈ పేరు ని పెట్టుకున్నాయి.

ఇక వాళ్ళు అందరూ పెట్టుకున్నారు మేము పెట్టుకుంటే తప్పేముంది అనుకున్నారు ఏమో తెలియదు కానీ ఓ కండోమ్ సంస్ధ తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడానికి RRR పేరుని ఉపయోగించుకుంది. ఇండియాలోని ఫేమస్ కండోమ్ బ్రాండ్స్ లో ఒకటైన ‘స్కోర్ కండోమ్’ RRR థీమ్ ను ఉపయోగించుకుని తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకుంది. అంతేకాకుండా ‘ఫైర్ అండ్ ఐస్’ థీమ్ తో వచ్చిన మూవీ సక్సెస్ కాగా.. అది పేరు ఇక్కడ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నది కంపెనీ. అయితే ఈ క్రమంలోనే RRRని ‘రా రెస్పాన్సిబుల్ రొమాన్స్’గా పేర్కొని ప్రచారం చేస్తుంది. దీని పై కొందరు నెటిజన్లు ఫన్నీ మీమ్‌స్ క్రియేట్ చేసి నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే వాడకం రా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.