రామారావు.. డ్యూటీ ఎక్కేది అప్పుడే!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని చిత్ర యూనిట్ పదేపదే చెబుతూ వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ సడెన్ సర్‌ప్రైజ్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. రవితేజ సినిమా అంటేనే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది రవితేజ ఓ విభిన్న పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో రామారావు ఆన్ డ్యూటీ కోసం ప్రేక్షకులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను వేసవి సీజన్ తరువాత జూన్ 17న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ మేరకు చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడంతో మాస్ రాజా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ఖిలాడి చిత్రం యావరేజ్ మూవీగా నిలవడంతో, ఈసారి రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలి అని వారు ఆశిస్తున్నారు. మరి రవితేజ ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో తెలియాలంటే జూన్ 17 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాను శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, దివ్యాంశ, రజీషా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.