2 కోట్లు ఇస్తే రెడీ అంటోన్న రష్మిక!

ఛలో సినిమాతో తెలుగునాట హీరయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన, ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంతో అతి త్వరలో స్టార్ హీరోల సరసన ఈ బ్యూటీ ఛాన్సులు దక్కించుకుంది. ఇక రష్మిక చేసిన సినిమాలు ఆమెకు నేషన్‌వైడ్‌గా కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. దీంతో ఆమె నేషనల్ క్రష్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకుంది.

అయితే ఇటీవల ‘పుష్ప-ది రైజ్’ చిత్రంతో అదిరిపోయే పాన్ ఇండియా మూవీతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అందరికీ షాకిస్తూ, ఏకంగా ఐటెం సాంగ్స్‌కు కూడా రెడీ అవుతోంది. అయితే ఒక్కో ఐటెం సాంగ్ కోసం అమ్మడు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఆమెకు రూ.2 కోట్ల రెమ్యునరేష్ అందిస్తే అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడనని నిర్మాతలకు క్లూ ఇచ్చిందట. దీంతో స్టార్ హీరోల చిత్రాల్లో రష్మికతో ఐటెం డ్యాన్ చేయించేందుకు రెడీ అవుతున్నారు స్టార్ ప్రొడ్యూసర్స్. అమ్మడు చెప్పిన మొత్తాన్ని ఇచ్చి మరీ ఆమెతో అందాల ఆరబోతకు సిద్ధమవుతున్నారు. మరి రష్మిక చేసే తొలి ఐటెం సాంగ్ ఏ హీరో సినిమాలో పడుతుందో చూడాలి అంటున్నారు ఆమె అభిమానులు.

Share post:

Popular