ఎన్టీఆర్ ని బండ అని ముద్దుగా పిలిచేది ఎవరో తెలుసా..?

ఎన్టీఆర్ అంటే ఇష్టపడని వాళ్లు ఉంటారా చెప్పండి..ఆయన అంటే కోట్లాది మంది ప్రజలకు అమితమైన ప్రేమ. నందమూరి వారసుడు..తాత పోలికలతో పుట్టిన ఈ జూ ఎన్టీఆర్..ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన ఆ ఎన్టీఆర్ ని గుర్తుచేస్తున్నాడు. నటనలో తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్న ఈయన..టాలీవుడ్ నెం 1 హీరోగా కొనసాగుతున్నాడు.

సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం సక్సెస్ లే కాదు అని..ఫ్లాప్ సినిమాలు పడ్డా..వాటిని తట్టుకుని..ఆ సినిమాల ద్వార ఎంతో నేర్చుకుని..క్రుంగిపోకుండా..మనం బాల్ ని ఎంత స్పీడ్ గా కొడితే అంతే స్పీడ్ గా రీబౌన్స్ అయ్యిన్నట్లు.. ఫ్లాప్ సినిమా పడిన ప్రతిసారి ..ఆ మరుసటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా నటించి..అభిమానుల చేత శభాష్ అని అనిపించుకున్నాడు.

ప్రస్తుతం తారక్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న ఎన్టీఆర్ ..తాజాగా జరిగిన డైనమిక్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఇంటర్వ్యుల్లో సరదాగా నవ్వుతూ..నవ్విస్తూ..సినిమా గురించి బోలెడు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. రాజమౌళి తో సినిమా షూటింగ్ ఎలా ఉంటుంది అనే సంగతులు గురించి చెప్పండి అంటూ అడగ్గా..ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ..ఇంట్రెస్టింగ్ విషయాలను లీక్ చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ..”అప్పటికే మమ్మల్ని మా ఎనర్జీనీ బాగా పిండేసి ఉంటాడు..అలిసిపోయి ఉన్నా కూడా రాజమౌళి వదిలేవారు కాదు. మేము రాజమౌళి చేతిలో నలిగిపోతూ ఆ బాధను..కొన్ని సంధర్భాలల్లో ఆయన భార్య రమతో చెప్పుకునేవాళ్లం. ఇక ఆమె కూడా ఆయనకు పిచ్చి బాగా పెరిగిపోయింది రా నాన్నా..నువ్వు పో త్వరగా వెళ్ళి ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రా..నా బంగారు నువ్వు వెల్లు రా బండ.. ఆ పిచ్చోడి దగ్గరకు పో” అంటూ చెప్పుకొచ్చేదని ఎన్టీఆర్ తో చెప్పిన మాటలని అభిమానులకు తెలియజేశాడు తారక్. దీని బట్టి రమ గారితో ఎన్టీఆర్ కు మంచి స్నేహ బంధం ఉంది అని తెలుస్తుంది. ఎంతలా అంటే తారక్ ని బండ అని ముద్దుగా పిలుచుకునేలా…!!