రాధే శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్రభాస్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

హిస్టోరికల్ డ్రామాగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11వ తేదీన విడుదలై మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్నా మంచి కలెక్షన్లను రాబట్టింది. కేవలం 3 రోజుల్లోనే రూ.151 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమా పై నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నప్పటికీ దర్శకుడు రాధాకృష్ణ అలాగే సంగీత దర్శకుడు తమన్ కూడా తమదైన శైలిలో ట్రోలర్స్ కి గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని కొంతమంది అంటుంటే మరికొంతమంది అంచనాలకు తగ్గట్టుగా చాలా బాగుంది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే రాధే శ్యామ్ సినిమాలో కొంత మంది నటీనటులు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లో ప్రభాస్ ప్రేమించిన అమ్మాయి పైన ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా వెళ్ళింది.

ఈ అమ్మాయి అందానికి , అభినయానికి ఫిదా అయిపోయి అభిమానులుగా మారుతున్నారు ప్రేక్షకులు.
ఈ అమ్మాయి ఎవరా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ అమ్మాయి పేరు తాషా.. ఇక అసలు పేరు జర్జియా లోరుస్సో.. ఈమె ఒక ఇటాలియన్ నటి. మొదటిసారి తెలుగు సినిమాలో నటించడం గమనార్హం. ఈ సినిమాలో ఈమె నటించింది కేవలం బ్యాక్ గ్రౌండ్ లో అయినప్పటికీ అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. తన నటనతో, అందంతో ప్రేక్షకులను బాగా అలరించింది.

ఈ ముద్దుగుమ్మకు మరిన్ని తెలుగులో అవకాశాలు రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు కూడా ఈ సినిమాతో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడమే కాకుండా నేషనల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.