టాలీవుడ్‌పై నోరుపారేసుకున్న బ్యూటీ.. ట్యాంకర్ అంటూ మండిపడుతున్న నెటిజన్లు!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాలని చాలా మంది అందగత్తెలు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అదృష్టం మాత్రం కొందరినే వరిస్తుండటంతో వారు మాత్రమే లైమ్‌లైట్‌లోకి వస్తారు. కానీ తమకు వచ్చిన అదృష్టాన్ని అవసరం ఉన్నంతసేపు వాడుకుని, ఆ తరువాత ఇదే ఇండస్ట్రీపై నోరుపారేసుకోవడం ఇప్పుడున్న స్టార్ బ్యూటీలకు అలవాటుగా మారిపోయింది. గతంలో రాధికా ఆప్టే, తాప్సీ లాంటి వారు టాలీవుడ్‌ను చిన్నచూపు చూసే విధంగా కామెంట్స్ చేసి ఆ తరువాత చెంపలు వాయించుకున్నారు.

ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించి పేరు, డబ్బు సంపాదించిన ఓ బ్యూటీ కూడా ఇదే తరహాలో ప్రవర్తిస్తోంది. ‘‘ఊహలు గుసగుసలాడే’’ చిత్రంతో టాలీవుడ్ జనాలకు ఆమెకు పట్టం కట్టి గతకొన్నేళ్లుగా ఆమె రాడ్డు యాక్టింగ్‌ను భరిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు కాస్త తగ్గాయి. దీంతో బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసిన ఈ బ్యూటీకి, ఓ వెబ్ సిరీస్‌లో ఛాన్స్ దొరికింది.

ఇక అదే గొప్ప విషయం అన్నట్టుగా, టాలీవుడ్ ఆడియెన్స్‌పై ఇష్టమొచ్చినట్లుగా నోరుపారేసుకుంది ఈ బ్యూటీ. సౌత్ ఆడియెన్స్ తనలోని ట్యాలెంట్ చూసి కాకుండా తన స్కిన్ టోన్ చూసి ఆదరించారంటూ చెప్పుకొచ్చింది. తొలుత తనను గ్యాస్ ట్యాంకర్ అంటూ సౌత్ ఆడియెన్స్ హేళన చేశారని, ఆ తరువాత తాను స్లిమ్ కావడంతో తన అందాలకు ఇక్కడి జనం ఫిదా అయ్యారే తప్ప తనలోని ట్యాలెంట్‌కు మాత్రం వారు గుర్తింపు ఇవ్వలేకపోయారని వాగింది ఈ బ్యూటీ.

ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ ఆమె కొంప ముంచేలా మారాయి. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదేనని.. అవసరం ఉన్నవరకు టాలీవుడ్‌లో చేసి, ఇప్పుడు భారీ రెమ్యునరేషన్, ఫేం కోసం బాలీవుడ్ చెంతకు చేరింది ఈ గ్యాస్ ట్యాంకర్ అంటూ సోషల్ మీడియాలో రాశి ఖన్నాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. యాక్టింగ్ రానీ ఈ బ్యూటీకి అక్కడి వారు ఎలా ఛాన్స్ ఇచ్చారో వారికే తెలియాలంటూ నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఏదేమైనా టాలీవుడ్‌పై నోరుపారేసుకుని ప్రేక్షకులకు టార్గెట్‌గా మారిన ఈ బ్యూటీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.