బిగ్ షాకింగ్: సామ్ ఫ్రెండ్ కు ఓకే చెప్పిన చైతన్య..సంచలన నిర్ణయం..?

టాలీవుడ్ ది మోస్ట్ రొమాంటిక్ కపుల్ ఎవరు అనగానే అందరు టక్కున చెప్పే పేరు..”సమంత-నాగచైతన్య”. కానీ, ఇప్పుడు వాళ్ళు విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్లది అన్నట్లు వేరువేరుగా బ్రతుకుతున్నారు. విధి ఆడిన వింత నాటకంలో ఈ జంట దారులు వేరు అయ్యాయి. ఎవ్వరు ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ప్రకటించి అభిమానులకు ఊహించని కోలుకోలేని షాక్ ఇచ్చింది ఈ జంట.

విడాకుల తరువాత సామ్ తన సినిమా పనుల్లో బిజీ అయితే..చైతన్య కొన్ని రోజులు సైలెంట్ అయ్యి..తన కెరీర్ పై ఫోకస్ చేస్తున్నాడు. ఒకప్పుడు పాలు నీళ్లు లా కలిసి ఉన్న ఈ జంట..ఇప్పుడు ఉప్పు నిప్పు లా చిట్ పట్ మంటున్నారు. ఈ జంట కలిస్తే బాగుండూ అని అనుకునే వారు ఇంకా ఉన్నారు..కానీ ఇక అది జరగదు అనే సత్యం వాళ్ళు గుర్తిస్తేనే మంచిది. కాగా, రీసెంట్ గా నాగ చైతన్య సమంత క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఇండస్ట్రీలో కొత్త డౌట్లు మొదలైయ్యాయి. సమంతకు డైరెక్టర్ నందిని రెడ్డి ఎంత క్లోఝ్ అనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమె తో తీసింది ఒక్కటే సినిమా అయినా.. ఫ్రెండ్ షిప్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎన్నో సార్లు నందిని తనకు ఎంత క్లోజ్ అనే విషయం సమంతనే స్వయంగా చెప్పుకొచ్చేది. ఇక ఇప్పుడు ఆ క్లోజ్ ప్రెండ్ తో చేతులు కలిపాడు నాగ చైతన్య అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ నందిని రెడ్డి తో కలిసి చైతన్య ఓ సినిమా చేయబోతున్నారట. నిజానికి ఈ సినిమా వాళ్ల విడాకుల ముందు అనుకున్నారని..కానీ ఇప్పుడు సింగిల్ గా చై తో తీయ్యాలని ఆమె ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే దీని పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..!!