వాడిని నేనైతై గట్టిగా తన్నేదాన్ని.. కంగనా కాంట్రవర్షియల్ కామెంట్స్..!!

కంగన రనౌత్ ..అందానికి అందం..నటనకి నటన ..రెండిటితో అందరిని మెప్పించగల నటి . ఈమె చేసిన సినిమాలో హీరోయిన్ గా గుర్తిపు తెచ్చుకోవడం కన్నా..వివాదస్పద వ్యాఖ్యలు చేసి..ఎక్కువ పాపులర్ అయ్యింది. అందుకే ఆమెను అంతా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటుంటారు. ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడటం ఆమె స్వభావం..అందుకే ఆమె అంటే చాలా మందికి నచ్చదు. ముఖ్యంగా పొలిటీషియన్స్ ఆమె అంటే గుర్రుగా ఉంటారు.

కాగా, రీసెంట్ గా కంగనా మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి..నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మనకు తెలిసిందే..ఈ ఏడాది ఆస్కార్స్ వేడుక కార్యక్రమం పెద్ద సంచలనాన్నే సృష్టించిందని. సినీ ప్రపంచంలో ఆస్కార్స్ అంటే ప్రత్యేకమైన గౌరవం. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావి స్తారు. ఈ అవార్డ్ అందుకుంటే చాలు అనే సెలబ్రిటీలు ఉన్నారు. ఈ ఏడాది ఆస్కార్స్ 2022 ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్యపై యాంకర్ క్రిస్ అభ్యంతరకర జోకులు వేయడంతో.. దానికి హార్ట్ అయిన విల్ స్మిత్..క్షణం కూడా ఆలోచించకుండా.. వేదికపై వచ్చి అతని చెంప చెళ్లుమనిపించాడు.. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారు షాక్ అయ్యారు. కాసేపు ఏం జరుగుతుందో తెలియక సైలెంట్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

కాగా, దీనిపై కంగనా స్పందిస్తూ..” ఆ యాంకర్ క్రిస్ ఒక ఇడియట్. అలా మాట్లాడటం తప్పు. విల్ స్మిత్ చేసింది కరెక్ట్. ఒక్కవేళ నేను ఆయన ప్లేస్ లో ఉండిఉంటే..గట్టిగా తన్నేదాని. కామెడీ చేయడానికి మా అమ్మ లేక సోదరికి ఉన్న వ్యాధిని ఉపయోగించుకుంటే నేను ఊరుకోను.. విల్ స్మిత్ కన్నా గట్టిగా తన్నేదాన్ని”అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం కంగనా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కంగనా నే కాదు చాలా మంది ప్రముఖులు కూడా క్రిస్ చేసింది తప్పు..తన భార్యని అలా అని ఉండ కూడదు అంటూ ఆయనకి మద్దతు ఇస్తున్నారు.