చిరంజీవి భార్య రెండో వివాహం.. అసలు విషయం ఏమిటంటే…!!

కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా కూడా ఒకరనే విషయం అందరికీ తెలిసిందే.. కన్నడ పరిశ్రమలో హీరోగా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలోనే.. అతనిని మృత్యువు వెంటాడింది. దీంతో ఆయన గుండెపోటుతో 35 సంవత్సరాలకే మరణించడం జరిగింది. ఇక మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే.. చిరంజీవి సర్జ మరణించే సమయానికి తన భార్య వయస్సు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. అయితే చిరంజీవి సర్జా మరణించే సమయానికి ఆమె 3 నెలల గర్భవతి కూడా.

అలాంటి సమయంలో ఎంతో అండగా ఉండాల్సిన భర్త కన్నుమూయడంతో ఆమె దుఃఖానికి లోనయింది. ఇక దీంతో ఆమెకు వచ్చిన కష్టాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకున్నారు. చిరంజీవి సర్జా 2020 జూన్ 7వ తేదీన మరణించారు. చిరంజీవి సర్జ మరణించే సమయానికి అతని చేతిలో ఆరు సినిమాల కు పైగా ఉన్నాయట. ఇక ఆయన అకస్మాత్తుగా మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఇప్పటికి కూడా తన కుటుంబ సభ్యులు మరణవార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక ఆయన మరణించిన తరువాత ఆరు నెలలకు మేఘనా కు ఒక అబ్బాయి కూడా జన్మించారు. మొన్నటివరకు తనని జూనియర్ చిరంజీవి సర్జా అని కూడా పిలిచేవారు.

అయితే ఇటీవల కాలంలో మేఘన తన కుమారుడి పేరు రయాన్ రాజ్ సర్జా అని నామకరణం చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. తన భర్త మరణించిన తర్వాత ఆమె తన ఇంట్లోనే ఉంటూ కొడుకుతో తన కాలక్షేపాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ బాధ నుంచి బయటికి రావడానికి తన కెరీర్పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. కెరియర్ పరంగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంతో చిరంజీవి సర్జా జ్ఞాపకాలు రాకూడదని ఆమె ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం మేఘనా రాజ్ రెండు సినిమాలలో నటిస్తున్న ది అందులో ఒకటి సెల్ఫీ మమ్మీ.. గూగుల్ డాడీ కాక, మరొకటి బుద్ధిమంత-2 ఇక ఆమె నటించిన ఈ రెండు సినిమాల త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే ఆమె రెండో వివాహం పై ఎటువంటి నిజం లేదని ఆమె సీరియస్ గా తెలియజేసింది. ఇక గతంలో బిగ్ బాస్ సీజన్-1 విన్నర్ తో ఆమె త్వరలోనే ఏడు అడుగులు వేయబోతున్న అని ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని తీసి పారేసింది.