రెండో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో..ఈ వయసులో “ఏం” చేయడానికి సారూ..?

ఏ వయసు లో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది. ఈ మాటలను మనం చాలా సంధర్భాలల్లో విని ఉంటాం. ముఖ్యంగా ఇంట్లో పెద్ద వాళ్ళు పెళ్లిల విషయంలో ఈ మాటలు అంటుంటారు. యస్..అది నిజమే కదా. ఆ విషయం మనకి తెలుసు. కానీ, నేటి కాలం యువత చదువులు, ఉద్యోగాలు..అంటూ పెళ్లి విషయంలో లేట్ చేస్తున్నారు. యంగ్ ఏజ్ లో బాగా కష్టపడి డబ్బులు సంపాదించాలని తెగ కష్టపడిపోతున్నారు. తీరా పెళ్లి వయసు దాటిపోయాక పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటున్నారు. అలా మనకు తెలిసిన సెలబ్రిటీలు. మన బంధువులు.ఇరుపొరుగు కు సంబంధించిన వాళ్లని చూసే ఉంటాం.

కానీ ఇక్కడ ఈ హీరో చేస్తుంది తెలిస్తే ఎవ్వరైన షాక్ అవ్వాల్సిందే. వయసులో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసి., మనస్పర్ధలు వచ్చాయో..మోజు తీరిపోయిందో తెలియదు కానీ ఫైనల్ గా విడాకులు ఇచ్చేశాడు. ఆ హీరో మరెవరో కాదు తన నటనతో.. స్మైల్ తో అప్పట్లో నే సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరో ప్రశాంత్. హీరో ప్రశాంత్… నిర్మాత త్యాగరాజన్ కొడుకు అని చాలా తక్కువ మందికే తెలుసు. తండ్రి పేరు చెప్పుకుని సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా తండ్రీ పరిచయాలను వాడుకోకుండానే స్టార్ హీరోగా అటు కోలీవుడ్ లోను, ఇటు తెలుగులోని తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. జీన్స్, జోడీ లాంటి చిత్రాలల్లో నటించిన ఈయన ఇప్పటికి ఆయనను అభిమానించే వారు ఉన్నారు.

కొన్ని కారణాల చేత ఇండస్ట్రీకి దూరమైన ఈయన… రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాదు. ప్రస్తుతం ఈ హీరో అంధాధూన్ రీమేక్ లో నటిస్తున్నాడు. కాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ప్రశాంత్ సన్నిహితుల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ హీరో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట. దాదాపు 50 వయసుకు చేరువ అవుతున్న ఈయన ఈ వయసులో రెండొ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ రిలేషన్స్ లోనే ఉండే ఒక అమ్మాయిని త్వరలోనే ఈ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడట. తన సినిమా అంధాధూన్ రిలీజ్ అయ్యాక ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నాడని సమీప బంధువల నుండి అందుతున్న సమాచారం. దీంతో ఈ హీరో పై నెట్టింట ట్రోలింగ్స్ స్టార్ట్ అయ్యాయి.. ఈ వయసులో పెళ్లా..? ఏం చేయడానికి హీరో అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ప్రశాంత్ నోరు విప్పాల్సిందే… లేకపోతే ట్రోలర్స్ ఆగరు.