సినిమాల్లోకి రాక‌ముందు ఈ హీరోయిన్ల అస‌లు పేర్లు ఇవే…!

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతో మంది స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు సంపాదించుకున్న నటీమణులు పేర్ల వెన‌క చాలా చిత్ర విచిత్రాలు ఉంటాయి. వీరు ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందు వీళ్ల‌కు ఒక పేరు ఉంటే.. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక మ‌రో పేరు ఉంటుంది. కొంద‌రు కాలం క‌లిసి రాక త‌మ పేర్లు వారే స్వ‌యంగా మార్చుకుంటారు. కొంద‌రికి మాత్రం ద‌ర్శ‌కులో లేదా వేరెవ్వ‌రో మారుస్తూ ఉంటారు. ఇలా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక పేర్లు మార్చుకుని స్టార్ హీరోయిన్లు అయిన వారు ఎవ్వ‌రో చూద్దాం.

జ‌యసుధ:
సహజ నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న జయసుధ అసలు పేరు సుజాత. అప్పటికే ఇండస్ట్రీలో సుజాత అనే హీరోయిన్ ఉండటం చేత ఈమెకు జయసుధ అని పేరు పెట్టారు.

జయప్రద:
ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మండ్రికి చెందిన జ‌య‌ప్ర‌ద అస‌లు పేరు లలితా రాణి. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈమె పేరును జయప్రద గా మార్చారు. ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్న జయప్రద ఆ తరువాత రాజకీయాలలోకి వెళ్లి రెండుసార్లు రాంపూర్ ఎంపీగా గెలిచింది.

శ్రీదేవి:
బాల‌న‌టిగా సినిమాల్లోకి వ‌చ్చిన శ్రీదేవి ఆ త‌ర్వాత హీరోయిన్ అయ్యి ఏకంగా ఆలిండియా స్టార్ అయ్యింది. శ్రీదేవి అస‌లు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఆమె బాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత బోనీక‌పూర్‌కు అప్ప‌టికే పెళ్ల‌య్యి పిల్లులు ఉన్నా కూడా అత‌డినే రెండో పెళ్లి చేసుకుంది.

సౌందర్య:
కన్నడ నటి అయిన సౌందర్య తెలుగు హీరోయిన్ గా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అసలు పేరు సౌమ్య. బీజేపీలోకి వెళ్లిన సౌంద‌ర్య 2004 ఎన్నిక‌ల వేళ కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగ‌ర్ రావు ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌స్తూ హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందారు.

రోజా:
సినిమాలలో రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్న రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. దివంగ‌త మాజీ మంత్రి శివ‌ప్ర‌సాద్ ఆమె పేరు రోజాగా మార్చారు.

రంభ:
విజ‌య‌వాడ‌కు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లోకి వ‌చ్చాక ఆమె పేరు రంభ‌గా మారింది.

నయనతార: లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్.

అనుష్క: సినిమాలలోకి రాకముందు అనుష్క పేరు స్వీటీ.సూపర్ సినిమా షూటింగ్ సమయంలో పూరి జగన్నాథ్ ఈమెకు అనుష్క అనే పేరును పెట్టారు. చివ‌ర‌కు ఆమెకు ఆ పేరు సెటిల్ అయిపోయింది.