RRR Event: రాజమౌళి కౌంటర్ ఆ పెద్దాయనకేనా..భళే బుక్ చేశాడే..?

ఇప్పుడు ఎక్కడ చూసిన RRR సినిమా గురించే చర్చలు, మాటలు వినిపిస్తున్నాయి. బాహుబలి లాంటి సినిమా ను తెరకెక్కించిన ఈ దర్శక ధీరుడు చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ప్రాజెక్ట్ “రణం రౌద్రం రుధిరం”. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ తారక్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన లుక్స్ ,పోస్టర్స్, పాటలు,టీజర్,ట్రైలర్..అన్ని అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. మరో ఐదు రోజుల్లో ఈ సినిమాను మనం తెర పై చూడబోతున్నాం.

ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా ను మార్చి 25న ధియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. కాగా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో నిన్న బెంగుళూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అభిమానులు అరుపులు ,కేరింతలు, చప్పట్ల మధ్య గ్రాండ్ గా ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో రాజమౌళి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space

వేదిక పై ఆయన మాట్లాడుతూ..” గత 10 నెలలు గా ఏపీలో టికెట్ ఇష్యూల వల్ల తల్లడిల్లిపోతున్న సినీ ప్రజలకోసం చిరంజీవి గారు ఎందరో మనుషుల మధ్య మాటలు పడి..మా కోసం మా బాగోకు కోసం తలవంచాడు. టికెట్ల విషయంలో నేను పరసనల్ గా ట్రై చేశా వర్క్ అవుట్ అవ్వలేదు..మిగత వాళ్లు కూడా తమకు తోచిన విధంగా ట్రై చేశారు..కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కానీ మ్యాటర్ లో కి చిరంజీవి గారు ఎంటర్ అయ్యి..ప్రాబ్లమ్ ని ఎటువంటి వివాదాలు లేకుండా కూల్ గా సాల్వ్ చేశారు. మమ్మల్ని నెగ్గించేందుకు చిరంజీవిగారు చాలామందితో ఎన్నో మాటలు పడ్డారు. అలా ఆయన చేసినందుకు ఎంతో మంది చిరంజీవి గారిని టార్గెట్ చేశారు..కానీ మాకోసం ఆయన అందరిచేత మాటలు అనిపించుకుని..మా సమస్యని పరీష్కరించారు. ఆయనకి ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఇష్టం ఉండదు..ఇండస్ట్రీ బిడ్డగానే ఉంటా అంటుంటారు..కానీ మా దృష్టిలో ఆయనే ఇండస్ట్రీ పెద్ద.. ధ్యాంక్యూ మెగాస్టార్ చిరంజీవి గారు మీరు నిజంగా ..మెగాస్టార్ ” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న బడా ఫ్యామిలీ..ఎవ్వరైతే చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని నెటిజన్స్ ఆడుకుంటున్నారు. నెట్టింట విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రాజమౌళి పరోక్షంగా కామెంట్స్ చేసిన..నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్న ఆ బడా ఫ్యామిలీ ఎవరో మీకు అర్ధమైయ్యేఉంటుందిగా..?