అలియా కి సారీ చెప్పిన రాజమౌళి.. ఫస్ట్ టైం తలవంచిన జక్కన్న..?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేం. నిన్న మొన్నటి వరకు జాన్ జిగిడి దోస్త్ లు లా రాసుకుని పూసుకుని తిరిగిన వారు ఒక్క సినిమా ..ఒక్కే ఒక్క సినిమా రిలీజ్ తరువాత నీకు నాకు కటీఫ్ అంటూ ఎవరిదారి వాళ్లు చూసుకుంటున్నారు. వినే వాళ్లకి చూసేవాళ్లకి ఇవి చిన్న పిల్లల ఆటలు లా అనిపించిన..కనిపించినా..కొందరి కళ్ళకి మాత్రం ఇవి పెద్ద ఇష్యూలానే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తుంది అలియా-రాజమౌళీ యవ్వారం.

అలియా అంటే ఎంతటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలో తన నటనతో మెప్పించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో అమ్మడు క్రేజ్ చూసిన జక్కన్న..తన సినిమా కోసం ఆమెను సెలక్ట్ చేసుకున్నాడు. అబ్బో సినిమా ప్రమోషన్స్ లో వీళ్ల నడిపిన హంగామా అంతా ఇంతా కాదు..ఓ రేంజ్..చూసేవాళ్లకి వీళ్ళ ఓవర్ యాక్షన్స్ తగలెయ్యా ..అని అనిపించేలా ఉన్నింది. ఏమైనా సినిమా అంటే ఆ మాత్రం ఓవర్ చేయకపోతే వర్క్ అవుట్ అవ్వదు అన్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో అమ్మడు ..జనాభాను చూసి స్టార్స్ RRR ని పొగిడేయడం చూసి..అలియా ఈ సినిమా ద్వారా ఓ రేంజ్ లోకి వెళ్లిపోతుందని అనుకుంది.

సీన్ కట్ చేస్తే..సినిమా హిట్..అలియా ఫట్..అసలు అలియాని పట్టించుకునే నాధుడే లేకపోయారు. ఈ సినిమాలో అలియాని హీరోయిన్ గా అనడం కన్నా గెస్ట్ రోల్ చేసింది అంటున్నారు ఫ్యాన్స్. దీంతో అలియా కి మడిపోయి..ఆ ఫైర్ ని రాజమౌళి పై చూయించింది. సోషల్ మీడియాలో ఆయనని అన్ ఫాలో చేసి..RRR కు సంబంధించిన పోస్ట్లు డిలిట్ చేసింది. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. దీంతో రాజమౌళి అలియా కు Phone చేసి క్షమాపణలు చెప్పిన్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. సినిమాలో నీ పార్ట్ కట్ చేయడానికి కారణం సినిమా నిడివి ఎక్కువైందనే తప్ప ..మరే ఇంటెన్షన్ తో కాదు.. నిన్ను హర్ట్ చేసుంటే సారీ అంటూ చెప్పుకొచ్చారని ఓ వార్త నెట్టింట కోడై కూస్తుంది.