RRR: వాళ్ల నోర్లు మూయించిన్నట్లేగా..అంతేగా అంతేగా..!!

ఎన్టీఆర్ .. ఒక్క ఆన్సర్ తో అందరి నోర్లు మూయించే సత్తా ఉన్న నటుడు…మంచి మనసున్న మనిషి. సాధారణంగా తారక్ ఒకరి జోలికి వెళ్ళడు..సైలెంట్ గా ఉన్న తన జోలికి వస్తే తాట తీసేస్తాడు ..అలా ఉంటాది తారక్ తో యవ్వారం. ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడే స్వభావం గల తారక్ అంటే ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం. రీసెంట్ గా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR సినిమాలో ఆయన పాత్ర పై..పాత్ర నిడివి పై ఎన్నో రకాల కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే.

సినిమాలో తారక్ రోల్ చిన్నది అని,.. సినిమా లో టోటల్ చరణ్ నే హైలెట్ చేశాడని.. రాజమౌళిని ట్రోల్ చేశారు ట్రోలర్స్..అంతేనా కొందరు అయితే ఏకంగా రాజమౌళికి తారక్ కి గొడవలు అయ్యాయని..ఇక వాళ్ల బంధం తెగిపోయిన్నట్లేనని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. దీనంతటికి సమాధానంగా తారక్ ఒక్కే ఒక్క నోట్ తో అలాంటి గాసిప్ రాయళ్ళ నోర్లు మూయించాడు. తన పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ..సినిమా సక్సెస్ అయినందుకు టీం కి..సక్సెస్ చేసినందుకు ఫ్యాన్స్ కి ధన్యవాదాలు తెలుపుతూ..చరణ్ ని..రాజమౌళిని పొగిడేశారు. దీంతో తారక్-చరణ్-రాజమౌళి పై వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పడ్డింది.

కాగా, ఈ నెల 25 న రిలీజైన RRR సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కని విని ఎరుగని రీతిలో కలెక్షన్స్ సాధిస్తూ..ఇండియన్ సినిమా అంటె ఇది అంటూ ఓ మార్క్ సెట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన బడా బడా స్టార్స్.చరణ్ -తారక్-రాజమౌళిని ఆకాశానికి ఎత్తుతూ పొగిడేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఓవర్‌సీస్, బాలీవుడ్ తెరలపై RRR ట్రెండ్ నడుస్తోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనను ఎంజాయ్ చేస్తున్నారంతా. ఇక ఈ సినిమా తరువాత, తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెల్సిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమా షూటింగ్ జూన్ లో ప్రారంభం కానుంది.