టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో .. దూసుకుపోతున్న హీరోలు వీళ్లేనా?

టాలీవుడ్ లో దాదాపు డజనుకు పైగా హీరోలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నది మాత్రం కొంత మంది హీరోలే అని చెప్పాలి. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని తో ఒక పవర్ఫుల్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సినిమాకు రెడీ అవుతున్నాడు నందమూరి నటసింహం. ఇక నాగార్జున ఇటీవల బంగార్రాజు సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఘోస్ట్ చిత్రంలో నటిస్తున్నాడు. వెంకటేష్ నారప్ప దృశ్యం 2 లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాన్ని అందుకుని ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల కు సిద్దంగా ఉండగా సలార్ ఆదిపురుష్ స్పిరిట్ ప్రాజెక్ట్ కె లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్ ప్రభాస్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది హరిహర వీరమల్లు భవదీయుడు భగత్సింగ్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు పవన్ కళ్యాణ్. సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న మహేష్ బాబు త్రివిక్రమ్ తో మరో సినిమా స్టార్ట్ చేసాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్చరణ్ శంకర్ సినిమా తో బిజీగా ఉన్నాడు. పుష్ప తో హిట్ కొట్టిన అల్లు అర్జున్ పుష్ప 2 కోసం రెడీ అయిపోతున్నాడు ఇక మరోవైపు వరుణ్ తేజ్ విజయ్ దేవరకొండ నాని లాంటి హీరోలు కూడా వరుస సినిమాలతో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు.