కోట్లు సంపాదిస్తున్న.. చిన్న ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్లు వీళ్ళే?

సాధారణంగా సినీ సెలబ్రిటీలు సినిమాల్లో కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎంతో విలాసవంతమైన భవనాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు నచ్చిన విధంగా కట్టుకునే ఇళ్ళలో ఉంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎక్కువగా సెంటిమెంట్ ఫాలో అవుతూ ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉన్నప్పటికీ అద్దె ఇంట్లో ఒక గడుపుతూ ఉంటారు. అలాంటి వారు టాలీవుడ్ లో కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ స్టార్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కు కోట్లలోనే పారితోషకం తీసుకుంటున్నారు. కానీ ఆయన విలాసవంతమైన భవనం లో కాదు కేవలం త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అక్కడ్నుంచి ఫామ్ హౌస్ కి ఇప్పుడు ఏపీలో అమరావతి లో ఒక చిన్న ఇంటిని నిర్మించుకుని ఉంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ గా గుర్తింపు సంపాదించుకున్న జగపతి బాబు కూడా కూకట్పల్లిలోని రోట టవర్స్ లో ఒక ఫ్లాట్ లో ఉంటూ ఉండటం గమనార్హం ఆయనకి మణికొండలో పెద్ద బంగ్లా ఉంది.

దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఇక ఇదే రూట్లో వెళ్తున్నారు. ఆయానుకున్న క్రేజ్కి సంపాదిస్తున్న ఆదాయానికి ఇంద్ర భవనం లాంటి ఇంట్లో ఉండవచ్చు. కానీ అవన్నీ వదిలేసి ప్రస్తుతం మణికొండలోని ఒక ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గచ్చిబౌలిలోని గేటెడ్ కమ్యూనిటీ హాల్ లో ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నారు. ఇలా ఎంతో మంది స్టార్లు సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు.