న‌లుగురు స్టార్ హీరోయిన్ల‌ను కీప్‌గా పెట్టుకున్న స్టార్ డైరెక్ట‌ర్‌..?

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామ‌న్‌. అది ఇప్ప‌టి నుంచే కాదు కొన్ని ద‌శాబ్దాల నుంచి పాతుకుపోయింది. ఇది 1970వ ద‌శ‌కం నుంచి ఉన్నా ఇంత విచ్చ‌ల‌విడిగా ఉండేది కాదు. పైగా ఇప్పుడున్నంత మీడియా అప్పుడు లేక‌పోవ‌డంతో పాటు హీరోయిన్లు ఈ విష‌యాలు బ‌య‌ట‌కు చెపితే ఎక్క‌డ త‌మ‌కు అవ‌కాశాలు రావో అని అన్నీ లోప‌లే దాచుకుని అణిగిమ‌ణిగి ఉండేవారు. ఇప్పుడు ఉన్న‌ది అంతా సోష‌ల్ మీడియా యుగం.

ఎవ‌రు ఏం చెప్పాల‌నుకున్నా మీడియా అక్కర్లేదు.. త‌మ సొంత సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లోనే చెప్పేస్తున్నారు. దీంతో మీడియా కూడా ఆ సెల‌బ్రిటీల కామెంట్ల‌ను హైలెట్ చేయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇక టాలీవుడ్ లో ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఉన్నాడు. ఆయ‌న ట్రాక్ రికార్డ్ బాగుంది. ఆయ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో వంద‌కు పైగా సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న సినిమాల్లో న‌టించిన ఎంద‌రో హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగారు.

అయితే ఆయ‌న ఎంతో మంది హీరోయిన్లను ఇబ్బంది పెట్టేవార‌ట‌. ఆ దర్శకుడు సినిమాలో అవకాశం రావాలంటే తప్పనిసరిగా ఆయనకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్న టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది. 1990వ ద‌శ‌కంలో స్టార్ హీరోయిన్ల‌లో చాలా మందిని ఆయ‌న అవ‌కాశాల కోసం వాడుకున్నార‌ని అంటారు. అయితే కొంద‌రు హీరోయిన్లు అవ‌కావం కోసం దిగ‌జారి బ‌త‌క‌లేక ఆయ‌న సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చినా కూడా వ‌దులుకున్నార‌ట‌.

ఆ ద‌ర్శ‌కుడు ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు ఏకంగా న‌లుగురు స్టార్ హీరోయిన్ల‌తో ఎఫైర్ కొన‌సాగించాడు. ఆ న‌లుగురు టాప్ హీరోయిన్లు కూడా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారే..! ఈ న‌లుగురు హీరోయిన్ల‌తో ఏకంగా త‌న అపార్ట్‌మెంట్లోనే వాళ్ల‌తో త‌న స‌ర‌స స‌ల్లాపాలు మెయింటైన్ చేసేవాడ‌ని అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ టాక్ ?