రష్మికకు ఆ కర్మ పట్టలేదట.. ఆ హీరో పరువు తీసేసిందిగా..?

కన్నడ బ్యూటి రష్మిక మందన కు ఇప్పుడు గుడ్ టైం నడుస్తున్నట్లు ఉంది. అందుకే కాబోలు చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అదే సమయంలో ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఇక ఇంత లక్..అందం ఉన్న హీరోయిన్ ను మన డైరెక్టర్లు నిర్మాతలు వదులుతారా..అబ్బే ఆ విషయంలో మనోళ్లు తగ్గేదేలే అన్నట్లు ముందుగానే రష్మికను తమ సినిమా కోసం లైన్లో పెట్టుకుంటున్నారు. అంతేనా అమ్మడు పెడుతున్న కండీషన్స్ కు ఓకే చెబుతూనే..అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.

ఇక అమ్మడు అదృష్టమా అన్నట్లు రీసెంట్ గా అమ్మడు నటించిన పుష్ప సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సంచలన విజయాని నమోదు చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఎక్కడికి పోయినా అమ్మడుకి రెడ్ కార్పెట్ వేసి..దండాలు పెడుతూ ఆహ్వానిస్తున్నారు. అంతేనా పుష్ప సక్సెస్ తో అమ్మడు కు బడా బడా డైరెక్టర్స్ నుండి..ఆఫర్లు అందుతున్నాయి. అయితే. ఈ కన్నడ పిల్ల కి తెలివితేటలు ఎక్కువ. అందుకే వచ్చిన ప్రతి సినిమా ఓకే చేయకుండా..తనకు నచ్చినా..ఫ్యూచర్ కి పనికొచ్చే పాజెక్ట్స్ కి కమిట్ అవుతుంది.

ఈ క్రమంలోనే చరణ్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేయాడానికి ఆమె కాల్ షీట్లు అడిగారట సినిమా మేకర్స్. అయితే ఇక్కడ ట్వీస్ట్ ఏమిటంటే రష్మిక పాత్ర టైం సినిమాలో చాలా తక్కువ ఉంటుందట కేవలం ఒక్క పాట..20 నిమిషాల స్క్రీన్ స్పేస్ ఉంటాది అంట. అంతే..ఆ తరువాత అమ్మడు క్యారెక్టర్ చనిపోతుందట. కాగా సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా కానీ సినిమాకి ఈ పాత్ర చాలా ఇంపార్ టేంట్ అంటు ఓ వార్త బయటకు వచ్చింది. దీని కోసం అమ్మడుకి అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారట దిల్ రాజు. కానీ, రెండో హీరోయిన్ గా చేయడానికి రష్మిక రెడీ గా లేదట. మరీ సినిమాలో 20 నిమిషాల క్యారెక్టర్ అంటే అది హీరోయిన్ పాత్ర కాదు..గెస్ట్ రోల్ అంటారు అంటూ రష్మిక అభిమానులు ఆమెకు ఈ సినిమా ఓకే చేయద్దు అంటూ సలహా ఇస్తున్నారట. సెకండ్ హీరోయిన్ గా చేసే కర్మ రష్మికకు లేదు అంటున్నారు. మరి చూడాలి రష్మిక ఏం చేస్తుందో..?