వామ్మో..తమన్నా కు విచిత్రమైన హ్యాబిట్..అస్సలు ఆపుకోలేదట..?

సినీ ఇండస్ట్రీలోకి రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లోకి అయితే పక్క భాష ఇండస్ట్రీ వాళ్లు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. వాళ్ళు రావడం సినిమా అవకాశాలు దక్కించుకోవడం తప్పు అనడం లేదు కానీ..మన తెలుగు అమ్మాయిలకు కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుంది అంటున్నారు కొందరు నెటిజన్స్. అయితే ఎంత మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు మన వాళ్ళు పాత హీరోయిన్ల అందాలను మర్చిపోలేకపోతున్నారు. అలాంటి హీరోయిన్ల లిస్ట్ లో తమన్నా భాటియా పేరు కూడా ఉంటుంది.

అప్పుడెప్పుడో 2007 లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపి డేస్ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా..అంతక ముందు ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అమ్మడు రంగు చూసి అందరు మిల్కీ బ్యూటీగా పేరు పెట్టేసారు. అందంతోనే కాదు నటనతో కూడా ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. వచ్చిన అవకాశాలను చేజార్చుకోకుండా..ఉన్న ఫిజిక్ ను కపాడుకుంటూ..ఇంకా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంది అంటే గ్రేట్ అనే చెప్పాలి.

హ్యాపీడేస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ్ లో నటించింది. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ సడెన్ గా అమ్మడు కెరీర్ గ్రాఫ్ డౌన్ అయ్యింది. ఒక్కసారిగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక అప్పుడు బాహుబలి సినిమాలో అవంతిక గా కనిపించి ..ప్రభాస్ తో పచ్చబొట్టేసిన సాంగ్ లో అందాలు ఆరబోసింది. ఇప్పటికి ఈ పాట చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అంతలా ఆకట్టుకుంది తమన్నా. కానీ, ఈ సినిమా తరువాత కూడా అమ్మడు అవకాశాలు లేకుండా ఖాళీగా ఉండటం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైంలో ఇండస్ట్రీలో తమన్నా పని ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. అని అనుకునే లోపే మళ్ళీ అవకాశాలతో బిజీ అయిపోయింది. చిరంజీవి పక్కన భోళా శంకర్ సినిమాలో..వెంకటేష్ పక్కన ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది.

ఇక అమ్మడు గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అది ఏమిటంటే..ఈ హాట్ బ్యూటీకి పావ్ భాజీ అంటే చాలా ఇష్టమట. అది కూడా రోడ్డు పక్కన బండి మీద దొరికే పావ్ భాజీ అంటే చాలా చాలా ఇష్టమట. ఎంత ఇష్టమంటే రోడ్డు పక్కన ఎక్కడ కనిపించిన సరే షూటింగ్ కు టైం అయిపోతున్న కార్ ఆపి కొనుకుని తినేస్తుందట. పావ్ భాజీ కనిపిస్తే తనను తాను కంట్రోల్ చేసుకోలేదట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వెరీ ఇంట్రెస్టింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరు అయితే మాకు పావ్ బాజీ అంటే చాలా ఇష్టం తమన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.