సీనియ‌ర్ ఎన్టీఆర్ అభిమాన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరు అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. నాటితరంలో సావిత్రి – జమున – జయసుధ – జయప్రద – శ్రీదేవి – శారద -వాణిశ్రీ – భానుమతి – అంజలి దేవి లాంటి క్రేజీ హీరోయిన్ ల తో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఘనత రామారావుది. వీరందరితో నటించిన ఎన్టీఆర్ కు ఓ హీరోయిన్ అంటే చాలా ఇష్టం అట. ఆ హీరోయిన్ ఎవరో కాదు తొలితరం హీరోయిన్ శాంతకుమారి. అప్పట్లోనే సహజ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శాంతకుమారి తనకన్నా వయసులో నాలుగు సంవత్సరాలు చిన్నోడు అయినా ఏఎన్నార్ తో కలిసి మాయాలోకం సినిమాలో నటించింది.

ఆ తర్వాత అదే నాగేశ్వరరావుకు తల్లిగా నటించి మెప్పించింది. విచిత్రమేంటంటే సీనియర్ నటుడు గుమ్మడి కంటే ఆమె ఎనిమిది సంవత్సరాల వయసులో పెద్ద. అలాంటిది గుమ్మడికి చెల్లిగా నటించిన శాంత కుమారి తర్వాత అదే గుమ్మడికి భార్యగా పలు సినిమాల్లో నటించింది. శాంతకుమారి నటి మాత్రమే కాదు… మంచి గాయని కూడా..! మాయాబజార్ సినిమాలో శశిరేఖ గా నటించి మెప్పించింది. ఆమె నటనకు అప్పటి మేటి దర్శకుడు పి.పుల్లయ్య ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే ఆమెతో ప్రేమలో పడ్డారు. అయితే వీరి పెళ్ళికి పెద్దలు ఇష్టపడలేదు. అయినా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.

అప్పటివరకు సుబ్బమ్మ గా ఉన్న పేరును శాంతకుమారిగా మార్చారు. ఆ తర్వాత శాంతకుమారి చాలా సినిమాల్లో తల్లిగా, భార్యగా నటించిన మెప్పించింది. ఇక సీనియర్ ఎన్టీఆర్ కు శాంతకుమారి వాయిస్ అంటే ఎంతో ఇష్టం… ఆమె కనిపిస్తే చాలు వెంటనే దగ్గరికి వెళ్లి మీ అభిమానిని అని… మీ పాట వినడానికి వచ్చాను అని చెప్పి ఆమెతో పాటలు పాడించుకునేవారు. ఎన్టీఆర్ ఆమె ఎదురుగా కూర్చుని ఎంతో ఇష్టంగా పాట‌లు వినేవారు. అప్పట్లో చాలా మంది హీరోలు, దర్శకులు… హీరోయిన్లు ఎన్టీఆర్ ను ఇష్టపడితే ఎన్టీఆర్ మాత్రం శాంతకుమారిని అభిమానించడం హాట్ టాపిక్ గా ఉండేది.

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన అనే సినిమాలో త‌ళ్లా పెళ్లామా అనే సినిమాలో కొన్ని పాటలను శాంతకుమారి తో పాడించుకున్నారు. ఇక శాంతకుమారి భక్తి పాటలు కూడా ఇష్టంగా పాడేవారు. అందుకే ఆమె నటిగానే కాకుండా మంచి గాయనిగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.