నేహాశెట్టి కట్టుకున్న ఈ చీర ధర తెలిస్తే..ఆశ్చర్యపోవాల్సిందే..అస్సలు నమ్మలేరు..!!

ప్రస్తుత పరిస్ధితులు ఒకప్పుడిలా లేవు. సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీలకు-అభిమానులకు మధ్య కమ్యూనికేషన్ పెరిగింది. ముఖ్యంగా ట్వీట్టర్, ఇన్స్టా అంటూ ఈ సోషల్ మీడియా యాప్ ల ద్వారా సెలబ్రిటీస్ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూనే ఉన్నారు. దీంతో వాళ్ళ ఇష్టా ఇష్టాలు..వాళ్ళు వాడే కాస్ట్లీ బ్రాండెడ్ వస్తువులు..ఏం తింటారు..ఎటువంటి బట్టలు ధరించడానికి ఇష్టపడతారు అనే విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మనలో చాలా మందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది.

పక్క వాళ్ళు వేసుకున్న డ్రెస్ కానీ, చీర కానీ బాగుంటే ఎంత ధర ఉంటాదో తెలుసుకోవడం. ఎవ్వరైనా మంచి డ్రెస్ వేసుకుంటే వెంటనే మనం అడిగేస్తాం..”అబ్బా..నీ డ్రెస్ భళే ఉంది..ఎక్కడ కొన్నావు..ఎంత డబ్బులు అయ్యింది” అని. మనలాంటి వాళ్ళంటే ఎక్కడ ఆఫర్లు పెడతారో..ఎక్కడ తగ్గువ రేట్లు దొరుకుతాయో తెలుసుకుని కొనుకుంటాం కానీ స్టార్ సెలబ్రిటీస్ ఎంత డబ్బుకైనా వెనుకాడారు. అంతేలేండి..మన పెద్దవాళ్ళు ఊరికే అన్నారా..పిండి కొద్ది రొట్టే అని. మన జీతాలు తక్కువ..ఇక ఆ స్దాయిలోనే మనం కొనుకోగలం. కానీ స్టార్ సెలబ్రిటీలు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. లక్షలు విలువ చేసే బట్టలు వేస్తే తప్పేముంది..?

అయితే ఇక్కడ ఓ హీరోయిన్ కట్టిన సారీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా డీజే టిల్లు తో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేహాశెట్టి కట్టిన చీర చాలా బాగుంది. ఇక అంత బాగుంటే మనం వదులుతామా..వెంటనే ఆ చీర ఎంత ఎక్కడ కొన్నారు అని సెర్చ్ చేస్తాం. అయితే ఈ చీర ధరను తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోయారు. నిన్న కాక మొన్న వచ్చిన హీరోయిన్..ఇప్పుడే ఫస్ట్ సినిమా హిట్ కొట్టిన హీరోయిన్ అప్పుడే అంత డబ్బులు పెట్టి చీర కొన్నిందా అంటూ షాక్ అవుతున్నారు. ఇక ఈమె కట్టిన చీర ఖరీదు అక్షరాల 38,880 రూపాయలట. నిజానికి ఈ చీరలో పెద్ద స్పేషాలిటీ ఏం లేదు. కానీ అమ్మడు ఎందుకు అంత డబ్బుపోసి ఈ చీరను కోన్నిందో అర్ధం కావడం లేదంటున్నారు నెటిజన్స్. ఫస్ట్ హిట్ సినిమా పడేసరికి అమ్మడు రేంజ్ బాగా పెరిగిందంటున్నారు కొందరు నెటిజన్స్.