చరణ్ ని నమ్మించి మోసం చేసిన స్టార్ డైరెక్టర్..ఉపాసన అన్బిలీవబుల్ కామెంట్స్..?

టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి ఎన్నో అధ్బుతమైన సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి కొడుకు రాం చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటన పరంగా చిరుత సినిమాతో పర్లేదు అనిపించినా..మగధీర సినిమాతో మాత్రం..అందరిని మెప్పించాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా చరణ్ కెరీర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక ఆ తరువాత హిట్లు ఫ్లాప్లు అని తేడాలేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు చరణ్. అయితే చరణ్ ను స్టార్ డైరెక్టర్ నమ్మించి మోసం చేశాడనే న్యూస్ బయటకి వచ్చింది.

- Advertisement -

రంగస్ధలం సినిమా టైంలో చరణ్-సుక్కుకి మధ్య ఓ సీన్ విషయంలో బాగా గొడవ అయ్యిందట. అదే చిట్టిబాబుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లే టైంలో సమంత వచ్చి కిస్ చేస్తుంది కదా ఆ సీనే వీళ్ళ మధ్య గొడవకు కారణం. నిజానికి చరణ్ స్టోరీ చెప్పిన్నప్పుడే అక్కడ ఆ సీన్ వద్దు..ఉపాసనకి ఇలాంటివి నచ్చవు అని చెప్పాడట. అయితే అప్పుడు సరే అని చెప్పిన సుకుమార్ తీరా షూటింగ్ టైంలో ఆ సీన్ చేసేటప్పుడు..చరణ్ ను మోసం చేస్తూ తనకు కావాల్సిన విధంగా ఆ సీన్ ను తెరకెక్కించాడట.

ఆ సీన్ చేసే రోజు కూడా చరణ్..సుక్కు సార్ కు వివరంగా చెప్పారట. ఇక సుకుమార్ కూడా ఓకే చరణ్ అంటూ..సీన్ వివరిస్తూ..”నువ్వు ఏం చేయకు పోలీసులు లాకుని వెళ్ళేటప్పుడు సమంత నీ దగ్గరకు వస్తుంది. జస్ట్ ముక్కు టచ్ అయ్యే విధంగా ఉంటుంది. దానికి మనం గ్రాఫిక్స్ లో సెట్ చేద్దం అని చెప్పారట. అయితే చరణ్ కి తెలియకుండా..సుకుమార్ సమంతకు వేరే విధంగా సీన్ చెప్పి నువ్వు డైరెక్ట్ గా చరణ్ లిప్స్ ను టచ్ చేయాలి. అప్పుడే సీన్ నేచురల్ గా ఉంటుంది అని చెప్పారట. ఇక సమంత కూడా చరణ్ కి కోపం వస్తుంది ఏమో.. మళ్ళీ ఉపాసన తో ప్రాబ్లం అవుతుంది ఏమో అంటూ భయపడుతూ వద్దు సుకుమార్ గారు అంటూ కన్వీన్స్ చేయడానికి ట్రై చేసిందట.

కానీ సుక్కు పట్టుపట్టడంతో సమంత కూడా తప్పక ఆయన చెప్పిన్నట్లు చేయడానికి సిద్ధపడ్డిందట. ఇక చరణ్ ఓకే అని షాట్ కు రెడీ అయ్యి..యాక్షన్ అని చెప్పగానే..సమంత పరిగెత్తుకుంటూ వచ్చి..నిజంగానే చరణ్ పెదలను తన పెదలతో టచ్ చేసిందట. దెబ్బకు షాకైన చరణ్. స్పాట్ లోనే సుకుమార్ పై కొపడ్డారట. అంతేకాదు..రెండు రోజులు షూటింగ్ కి కూడా వెళ్లలేదట. దీంతో చిరంజీవి ఎంటర్ అయ్యి..పరిస్ధితిని కూల్ గా సాల్వ్ చేసారట. ఇక ఆ కిస్ సీన్ పై ఉపాసన మొదట్లో బాధపడినా..ఆ తరువాత అర్ధం చేసుకుని .. కూల్ అయ్యిందట. ఇంత పెద్ద తతంగం జరిగినా ఆ సీన్ మాత్రం తెర పై బాగా పండింది. ఇక ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో మనకు తెలిసిందే.

Share post:

Popular