అరియనా నడుముపై అషు రెడ్డి ముద్దు.. నెటిజన్స్ ట్రోలింగ్?

సోషల్ మీడియాని బాగా వాడుకొని ఫేమస్ అయింది ఎవరు అంటే ముందుగా వినిపించేది ఇద్దరి పేర్లే. అదే అషు రెడ్డి, అరియనా గ్లోరీ.. సోషల్ మీడియాని ఎంత గట్టిగా వాడేశారు అంటే అందరూ ఏకంగా సోషల్ మీడియా తోనే బిగ్బాస్ వరకు వెళ్లారు. ఇక బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీల అవ్వకుండా ఉంటారా.. ఇక ఒక్కసారి గా తెలుగు ప్రేక్షకుల అందరికీ కూడా ఈ ఇద్దరూ సుపరిచితులుగా మారిపోయారు. బిగ్ బాస్ కి వెళ్లి హౌస్ లో రచ్చ చేయడమే కాదు బిగ్బాస్ బయటికి వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉన్నారు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు. అషు రెడ్డి మూడవ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ కి వెళ్తే… అరియనా నాలగవా సీజన్లో కంటెస్టెంట్ గా వెళ్ళింది.

ఎప్పుడు వెళ్తే ఏంటి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత పాపులారిటీ మాత్రం కామన్ కదా. బయటకి వచ్చిన తర్వాత సెన్సేషనల్ రాంగోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం సినిమా అవకాశాల తో పాటు పలు షోలు కూడా చేస్తూ బిజీ బిజీగా మారిపోయారు ఈ సోషల్ మీడియా ముద్దుగుమ్మలు. అయితే సైలెంట్ గా ఉంటే అందరూ మర్చిపోతారు అందుకే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారవచ్చు అనుకున్నారో ఏమో.. ఇక వీరిద్దరూ చేసిన పని కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 

ఇటీవలే ఒక షోలో పాల్గొన్నారు ఈ ఇద్దరు. అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ ఫోటోలలో ఆశు రెడ్డి అరియనా నడుముపై ముద్దు పెడుతుంది. ఇక దీంతో అరియనా రొమాంటిక్ మూడ్లో ఎక్స్ప్రెషన్ ఉతుంది. ఇక ఈ ఫోటోని అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. హద్దులేని ఎక్స్ప్రెషన్ అంటూ ఒక ట్యాగ్ కూడా జత చేసింది అషు రెడ్డి. ఇక దీనికి స్పందించిన అరియనా అషు నీకు దండం… పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారే జడ్జిమెంటల్ అవుతున్నాం అంటూ కామెంట్ పెట్టగా.. అందరూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు అలా అని మన క్రేజీనెస్ వదిలేయకూడదు ఈ విషయం మనం ఆర్జీవీ నుంచి నేర్చుకున్నాం అంటూ రిప్లై ఇచ్చింది. ఇద్దరు భామలు పెట్టిన పోస్టు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది.