వామ్మో..బన్నీని పెళ్లిచేసుకోడానికి స్నేహా ఇన్ని కండీషన్స్ పెట్టిందా..నువ్వు గ్రేట్ సామీ.!?

అల్లు అర్జున్..మెగాస్టార్ పేరు చెప్పుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..ఆ తరువాత క్రమ క్రమంగా స్టైలిష్ స్టార్ గా ..ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలకు సైన్ చేస్తూ ఐకానిక్ స్టార్ గా ఎదిగిపోయాడు. రీసెంట్ గా పుష్ప సినిమాతో తిరుగులేని విజయం అందుకున్న బన్నీ..ఇప్పుడు ఒక్కో సినిమాకి ఏకంగా 100కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. మొన్నటి వరకు 60-70 కోట్లు పారితోషకంగా పుచ్చుకునే ఆయన.. పుష్ప సక్సెస్ తో..రేంజ్ తో పాటు రెమ్యూనరేషన్ ని కూడా పెంచేసారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తన దగ్గరకు వచ్చే డైరెక్టర్లకి కూడా.. కొన్ని కండీషన్ పెట్టి వాటికి ఓకే అయితేనే స్టోరీ వినడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారట.

కాగా డైరెక్టర్స్ కు కండీషన్స్ పెడుతున్న బన్నీకి కూడా ఓ అమ్మాయి కండీషన్లు పెట్టి షాక్ ఇచ్చింది అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. యస్..అందిన సమాచారం ప్రకారం..లీకైన మ్యాటర్ బట్టి..ఇదే నిజం అని అందరు అంటున్నారు. బన్నీకే కండీషన్స్ పెట్టిన ఆ అమ్మాయి ఎవరా..అని ఆలోచిస్తున్నారా..?..ఎక్కువ ఆలోచించకండి..ఇక్కడ చదివి ఆ అమ్మాయి ఎవరు..? ఎందుకు కండీషన్స్ పెట్టింది..? ఏం కండీషన్స్ పెట్టిందో..తెలుసుకోండి..!!

బన్నీకి కండీషన్స్ పెట్టిన ఆ అమ్మాయి ఎవరో కాదు..ఆయన ప్రాణంగా ప్రేమించి ఇష్టంగా పెళ్ళిచేసుకున్న స్నేహా రెడ్డి. బన్నీ-స్నేహాల ది లవ్ మ్యారేజ్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఓ పబ్ లో స్నేహాను చూసిన బన్నీ..స్పాట్ లోనే లవ్ లో పడ్డాడట . అంతేకాదు అప్పుడే బన్నీకి తెలిసిపోయిందట తనే నా ప్రేమ దేవత అని. ఇక అప్పుడే బన్నికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో తెలిసివచ్చిందట. ఇంకేముంది ఎలాగోలా ఫ్రేండ్స్ ద్వారా స్నేహా డీటైల్స్ తీసుకుని..ఆమె ఎక్కడికి వెళ్ళితే అక్కడికి ఫాలో అయ్యేవాడట. ఎటు చూసిన బన్నీ కి ఆమె రూపమే కళ్ల ముందు కనిపించేదట. ఇక ఆలస్యం చేయకుండా బన్నీ వెంటనే ఆమెకు ప్రపోజ్ చేసాడట. అయితే స్నేహా చాలా తెలివి గల అమ్మాయి..అన్నీ విధాలా ఆలోచించి..కొన్ని కండీషన్స్ పెట్టిందట.

బన్నీ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే వారానికి ఓరోజు అయిన తనతో టైం గడపాలని..అదే విధంగా అల్లు అర్జున్ అవుట్ డోర్ షూటింగ్స్ కు వెళ్లితే ఖచ్చితంగా డైలీ వీడియో కాల్ చేసి మాట్లాడాలి అని..మరీ ముఖ్యంగా తన డైట్ తన డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో ఎలాంటి రీస్ట్రిక్షన్స్ పెట్టకూడదని..పెళ్లి తరువాత నా ఇష్టాలకు వాల్యు ఇవ్వాలని..కరాఖండీగా చెప్పేసిందట. నిజం చెప్పాలంటే స్నేహ ఒక్కటే కాదు ఏ భార్య అయిన సరే ఓ భర్త దగ్గర నుండి ఇవే ఎక్స్ పెక్ట్ చేస్తుంది. తన భర్త తనతో సమయం గడపాలని ఏ భార్య కి ఉండదు..చెప్పండి. ఇక ఫైనల్లీ స్నేహా కండీషన్స్ కు ఓకే చెప్పి.. ఐ లవ్ యూ టూ బన్నీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట స్నేహా. ఇక ప్రస్తుతం ఈ జంట ఇద్దరి పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. సో.. అలా వీళ్ల మ్యారిడ్ లైఫ్ 4 సినిమాలు..6 టూర్లు లాగా హ్యాపీగా ముందుకు వెళుతుందనమాట.


Leave a Reply

*