విడాకుల‌పై అక్కినేని హీరో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అక్కినేని ఫ్యామిలీలో వ‌రుస పెట్టి విడాకుల సంఘ‌ట‌న‌లో, పెళ్లిళ్లు పెటాకులు అవ్వ‌డ‌మో జ‌రుగుతూ వ‌స్తోంది. గ‌తేడాది అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య – స‌మంత అనూహ్యంగా విడాకులు తీసుకుని అంద‌రికి షాక్ ఇచ్చారు. అంత‌కు ముందే నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ ఎంగేజ్‌మెంట్ శ్రియా భూపాల్‌తో జ‌రిగాక కూడా వ్య‌వ‌హారం పెటాకులు అయ్యింది. అఖిల్ పెళ్లి ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత బ్రేక‌ప్ అవ్వ‌డం ఎవ్వ‌రికి మింగుడు ప‌డ‌లేదు.

అంత‌కు ముందే అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున‌కు ముందు పెళ్లి కలిసి రాలేదు. ఆ త‌ర్వాత అక్కినేని మ‌న‌వ‌డు సుమంత్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకుని యేడాదికే విడాకులు ఇచ్చేశాడు. సుమంత్ సోద‌రి సుప్రియ‌కు మొద‌టి పెళ్లి క‌లిసి రాలేదు. ఇలా అక్కినేని ఫ్యామిలీకి తొలి పెళ్లి పెద్ద బ్యాడ్ సెంటిమెంట్ అయిపోయింది. తాజాగా సుమంత్ నటించిన మ‌ళ్లీ మొద‌లైంది ఈ నెల 11న జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో సుమంత్ విడాకులపై మాట్లాడక తప్పలేదు. ఈ సినిమా క‌థే విడాకుల విష‌యంలో న‌డుస్తోంది. ఈ సంద‌ర్భంగా సుమంత్ మాట్లాడుతూ చాలా మంది ఫ‌స్ట్ మ్యారేజ్ విష‌యంలో మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌స్తే విడాకులు తీసుకుంటున్నారు… రెండో పెళ్లి త‌ర్వాత కూడా స‌మ‌స్య‌లు వ‌చ్చినా స‌ర్దుకుపోతున్నారు. రెండో పెళ్లి త‌ర్వాత కూడా మ‌రోసారి పెళ్లి ఆలోచన చేస్తే బాగుండ‌ద‌ని భావించి అక్క‌డితో స‌ర్దుకుపోతున్నారు.. నా స్నేహితుల్లో అలా చాలా మంది ఉన్నార‌ని సుమంత్ చెప్పాడు.

మా ఫ్యామిలీలోనూ విడాకులు ఉన్నాయి.. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇప్పుడు విడాకులు తీసుకోవ‌డం కామ‌న్ అయిపోయింది… కార‌ణాలు ఏవైనా కొన్నిసార్లు అలా జ‌రిగిపోతుంటుంద‌ని సుమంత్ చెప్పాడు.


Leave a Reply

*