సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా సక్సెస్ కాని హీరోలు ఎవరో తెలుసా?

సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారంతా సినిమా రంగంలో రాణించాలి అనే రూల్ ఏమీ లేదు. హీరోల వారసులతో పాటు దర్శకులల వారసులు సైతం కొందరు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. హీరోలుగా కొందరు సత్తా చాటుకున్నారు. అయితే సినిమా రంగంలో రాణించాలి అంటే సినిమా బ్యాగ్రౌండ్ ఉంటే చాలాదు. మంచి నటన కూడా వచ్చి ఉండాలి. ఒకటి రెండు సినిమాలతోనే తన సత్తా చాటుకోవాలి. అప్పుడే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతారు. ఇంతకీ సినీ బ్యాగ్రౌండ్ ఉండి సక్సెస్ కాలేకపోయిన సినీతారలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పటి విప్లవ సినిమాల దర్శకుడు టి కృష్ణ కొడుకు గోపీచంద్. ఇతడు చాలా కష్టపడి తొలుత విలన్ గా చేశాడు. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. దర్శకుడు రాఘవేంద్రరావు ఎందరికో మంచి హిట్ సినిమాలు అందించాడు. కానీ తన కొడుకు ప్రకాష్ మాత్రం హీరోగా సక్సెస్ కాలేదు. దాసరి నారాయణరావు సైతం పలువురితో గొప్ప సినిమాలు చేశాడు. తన కొడుకకు అరుణ్ కుమార్ ను ఎంత ప్రమోట్ చేసినా మంచి హీరోగా ఎదగలేకపోయాడు. అప్పట్లో టాప్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి సైతం తన కొడుకు వైభన్ సినిమాల్లోకి తీసుకొచ్చినా.. టాలీవుడ్ లో సక్సెస్ కాలేదు. దర్శకుడు ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ సినిమాల్లోకి వచ్చినా పెద్దగా పేరు సంపాదించలేదు. ఈవీవీ తనయుడు అల్లరి నరేష్ సక్సెస్ అయ్యేందుకు చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన అన్న ఆర్యన్ రాజేష్ సైతం అంతగా సక్సెస్ కాలేదు.

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది హీరోగా పలు సినిమాలు చేసినా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. కీరవాణి కొడుకు శ్రీసింహా కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. మాస్ సినిమాల దర్శకుడు పూరీ తన కొడుకు ఆకాశ్ ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోతున్నాడు. మరో దర్శకుడు శోభన్ వారసుడు సంతోష్ హీరోగా మారినా పెద్దగా సక్సెస్ కాలేదు.