ఎన్టీఆర్ సినిమాలో తాతమ్మ క్యారెక్టర్ చేసేందుకు భానుమతి పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా?

భానుమతి.. తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత నటి. ఈమె గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియక పోయినా.. గతం తాలూకు సినిమా అభిమానులకు చాలా బాగా తెలుసు. ఆమె ఎన్నో సినిమాల్లో అద్భుత పాత్రలను పోషించి మెప్పించింది. ఆమె సినిమాలో నటిస్తే.. తను తప్ప మిగతా పాత్రధారులు ఎవరూ అంతగా కనిపించరు అనేది అప్పట్లో సినిమా జనాలు అనుకునే వవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలతో కలిసి నటించడమే కాదు.. తన బ్యానర్ లో వారితో సినిమాలు కూడా తీసింది భానుమతి. అంతేకాదు.. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పేది తను. రామారావు కూడా తనంటే ఎంతో గౌరవంగా చూసేవాడు. వీరి విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఎన్టీఆర్‌ స్వయంగా దర్శకత్వం వహించిన సినిమా తాతమ్మ కల. ఈ సినిమాలో లుత తాతమ్మ పాత్రలో భానుమతి చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించారు. అయితే ఇందులో తనకు మనువడిగా ఎన్టీఆర్ నటించాలి. ఈ పాత్రకు తను ఒప్పుకుంటుందో? లేదో? అని అనుమానపడ్డారు. ఎన్టీఆర్ నేరుగా అడగలేక.. రచయిత ససరసరాజును భానుమతి దగ్గరికి పంపించాడు. కథ గురించి, తాతమ్మ పాత్ర గురించి ఆమెకు వివరించాడు రరచయిత. తనకు ఈ పాత్ర నచ్చిందని.. తప్పకుండా చేస్తానని చెప్పింది. అదే సమయంలో భానుమతి అమ్మాయి పెళ్లి అనే సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా చేస్తే తాను.. తాతమ్మ కలలో నటిస్తానని చెప్పింది. అందుకు ఓకే చెప్పాడు ఎన్టీఆర్.

అటు అమ్మాయి పెళ్లి సినిమాకు గాను ఎన్టీఆర్ తీసుకునే పారితోషకం ఇచ్చేందుకు ఓకే చెప్పింది. అయితే భానుమతికి ఎంత పారితోషకం ఇవ్వాలి? ఇదే విషయాన్ని రచయిత తనను అడిగింది. రామారావు ఓ సినిమాకు తీసుకునే పారితోషకంలో నాకు 5 వేలు తగ్గించి ఇవ్వండి అని చెప్పింది. దీంతో తను ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కి.. విడుదలయ్యాయి. మంచి విజయాన్ని అందుకున్నాయి.