మొదటి సారి కాకుండా రెండో సారి విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా ఎన్టీఆర్ సినిమా

లక్షాధికారి.. ఎన్టీఆర్ నటించిన తొలి సస్పెన్స్ మూవీ. 1963లో వచ్చిన ఈ సినిమాలో ఆయన అద్భుత నటన కనబర్చారు. తెలుగు సినిమా పరిశ్రమకు కొత్తరకం కథలు పరిచయం అయ్యేలా చేసింది ఈ సినిమా. ఈ సినిమాకు తమ్మారెడ్డి క్రిష్ణమూర్తి నిర్మాతగా పని చేశారు. తను మరెవరో కాదు ప్రస్తుత దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి. తన సొంత బ్యానర్ రవీంద్ర ఆర్ట్స్ పిక్చర్స్ లో ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా మేకింగ్ కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి.

ర‌వీంద్ర ఆర్ట్ పిక్చ‌ర్స్ స్థాపించానికి ముందు త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి.. సార‌థి పిక్చ‌ర్స్‌ లో చీఫ్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేశాడు. అయితే తన అభిరుచికి తగినట్లుగా సినిమాలు చేయాలని భావించి బయటకు వచ్చాడు. రవీంధ్రనాథ్ టాగూర్ మీదున్న అభిమానంతో ఆయన రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ను ఏర్పాటు చేశాడు. ఆయన చేసిన తొలి సినిమా లక్షాధికారి. ఈ సినిమాకు దర్శకుడిగా మధుసూదనరావును తీసుకున్నాడు. సంగీతం చలపతిరావు అందించాడు.

ఈ సినిమాకు తొలుత హీరోగా ఏఎన్నార్ ను అనుకున్నాడు. ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నాడు. అటు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడు. హీరోయిన్ గా క్రిష్ణ కుమారిని తీసుకున్నారు. ఈసినిమా బడ్జెట్ నాలుగున్నర లక్షలు అనుకున్నారు. అప్పటికే హిందీలో పలు సస్పెన్స్ సినిమాలు వచ్చాయి. వాటి ఆధారంగా స్క్రీన్ ప్లే తయారు చేశారు. ఈ సినిమాలో విలన్ గా గుమ్మడిని ఎంపిక చేశారు. తొలుత నాగ భూషణంను అనుకున్నా.. చిరవకి గుమ్మడిని తీసుకున్నారు. 1963 సెప్టెంబ‌ర్ 27న రిలీజైన ల‌క్షాధికారి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తొలిసారి కంటే రెండోసారి విడుదలై మంచి వసూళ్లను అందుకుంది.