‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ రివ్యూ …రేటింగ్ చూస్తే మైండ్ బ్లాకె !

January 13, 2022 at 12:01 pm

రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ క్రేజీ స్టార్స్ అయినా యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ‘ఆర్ఆర్ఆర్’మన అందరకి తెలిసిందే .ఈ పాన్ ఇండియా సినిమా కోసం సినీ అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారో అందరకి తెలిసిందే .ఈ జనవరి 7 న రిలీజ్ అవ్వాల్సిన ఆర్ ఆర్ ఆర్ . కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో అభిమానులు నిరాశచెందారు. .ఈ చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని ముగించారు. టీజర్స్, ట్రైలర్ తో అంచనాల్ని ఓ రేంజ్ లో పెంచేసిన ఈ సినిమాకి సంబంధించి తాజాగా మరో అంకం పూర్తయింది. ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. దీనికి ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేశారో బయటకి తెలియదు కానీ.. సెన్సార్ రివ్యూ ఒకటి మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేంటంటే బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అయిన ఉమైర్ సంధు ‘ఆర్.ఆర్.ఆర్’ సెన్సార్ రివ్యూను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేశారు. ‘మైండ్ బ్లోయింగ్.. జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్’.. ఇద్దరూ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటూ.. ఫైర్ ఎమోజీని షేర్ చేశారు. ఇంతకుముందు ఉమైర్ చందు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాస్ గురించి అభిమానులకి రిలీజ్ ముందు రేటింగ్ ఇచ్చేవాడు .దీంతో అభిమానులు సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్స్ గురించి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఉమైర్ సంధు చెప్పినట్టుగా ‘ఆర్.ఆర్.ఆర్’ ఎన్నిరికార్డుల్ని బ్రేక్ చేస్తుందో చూద్దాం.

‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ రివ్యూ …రేటింగ్ చూస్తే మైండ్ బ్లాకె !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts