జబర్దస్త్ తో ఫేమస్ అయిన ఫీమేల్ ఆర్టిస్లు వీరే..

జబర్దస్త్.. తెలుగు బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన షో. మల్లెమాల ప్రొడక్షన్స్ నుంచి పురుడు పోసుకున్న ఈ షో.. ఈటీవీలో ప్రసారమై మంచి పాపులారిటీ సంపాదించింది. ఎన్నో అద్భుతమైన స్కిట్లతో జనాలను బాగా నవ్విస్తుందవి ఈ షో. జబర్దస్త్ వేదిక నుంచి ఎంతో మంది కమెడియన్లు బయటకు వచ్చారు. వారిలో చాలా మంది మట్టిలో మాణిక్యాలే. అంతేకాదు.. చాలా మంది కమెడియన్లకు ఈ షో గుర్తింపు తెచ్చింది. ఈ షో ద్వారా జనాలకు పరిచయం అయిన చాలా మంది సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఇందులో పలువురు ఫీమేల్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. చక్కటి టైమింగ్ తో వారు వేసే పంచులు జనాలకు నేరుగా చేరి.. నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. ఇంతకీ ఈ షో ద్వారా పాపులర్ అయిన ఫీమేట్ కమెడియన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

*రోహిణి
పలు సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో మూలంగా వెండి తెరపై చాలా అవకాశాలు కూడా వస్తున్నాయి.

*షబీనా
ఈమె కూడా ఇప్పటి వరకు పలు సీరియల్స్ లో నటించింది. అనంతరం జబర్దస్త్ స్టేజ్ మీదకు చేరింది. ఈమె వేసే పంచుల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

*వర్ష
జబర్దస్త్ స్టేజి మీద వర్ష, ఇమ్మాన్యుయేల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సీరియల్స్ ద్వారా ఈ షోలో పాల్గొని మంచి పేరు సంపాదించింది.

*పవిత్ర
టిక్ టాక్ లో ఫేమస్ అయిన ఈ బొద్దమ్మాయి.. జబర్దస్త్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

*రీతూ చౌదరి
ఈమె కూడా మంచి కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చక్కటి యాక్టింగ్ తో బాగా ఫేమస్ అయ్యింది.

*ఫైమా
పటాస్ షో నుంచి జబర్దస్త్ స్టేజి మీదకు వచ్చిన ఈ అమ్మడు కూడా చక్కటి టైమింగ్ తో వేసే పంచులు పటాసుల్లా పేలుతున్నాయి.

*సత్య శ్రీ
చమ్మక్ చంద్ర టీం ద్వారా జబర్దస్త్ లోకి వచ్చిన సత్య.. ఈ షోతో మంచి ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.