పెళ్లికి ముందే కీలక నిర్ణయం తీసుకున్న నయన్, విఘ్నేష్..

నయనతార – విఘ్నేష్ శివన్.. తమిళ నాట లవ్ బర్డ్స్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా వీరి టాపిక్కే హాట్ టాపిక్. కోలీవుడ్ లో లవ్ లీ కపుల్ గా మార్మోగుతున్నారు. త్వరలో వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే చాలా కాలంగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రేపు, మాపు అంటూ ఇంకా కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా వీరిద్దరు ఏ క్షణంలోనైనా పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే వీరు పెళ్లి కాకముందు నుంచే ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఫుడ్, బెడ్, అన్నీ అందులోనే. పెళ్లి మాత్రమే పెండింగ్ ఉందట.

ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి.. ఇద్దరూ అప్పుడే ఫ్యూచర్ ఫ్లాన్స్ వేసుకుంటున్నారు. చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం చెన్నై పోయెస్ గార్డెన్ లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. అంతేకాదు.. వారికి నచ్చినట్లుగా దాన్ని డిజైన్ చేయించుకున్నారు. ఇందుకోసం చాలా ఖర్చు చేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే.. మరో విషయం బయటకు వచ్చింది.

నయన్, విఘ్నేష్ కలిసి దుబాయ్ లో భారీగా పెట్టుబడులు పెట్టారట. సుమారు రూ. 100 కోట్ల మేర ఓ ప్రముఖ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారట. ఈ పెట్టుబడులు పెట్టడానికి ముందే కంపెనీ గురంచి బాగా స్టడీ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ కంపెనీ కూడా చాలా కాలంగా మంచి గ్రోత్ కనబరుస్తుందట. మంచి లాభాలు ఉన్న వ్యాపారం కావడంతో అందులో పెట్టుబడులకు మొగ్గు చూపారట. వీరి నిర్ణయం పట్ల కోలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అటు ఇప్పటికే నిర్మాతగా మారిన నయనతార.. పలు వ్యాపారాల్లోనూ భారీగానే పెట్టుబడులు పెడుతోంది. రెస్టారెంట్లతో పాటు పలు రకాల కాస్మోటిక్స్ సంస్థల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంది.