రూ. కోటి క్లబ్ లో చేరిన హాట్ బ్యూటీ నిధి…

ఒకప్పుడు సినిమా బడ్జెట్ మామూలుగా ఉండేది. హీరో, హీరోయిన్ల పారితోషకం కూడా తక్కువగానే ఉండేది. అయితే గడిచిన కొంత కాలంగా సినిమా బడ్జెట్ ఓరేంజిలో పెరిగిపోయింది. వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగానే నటీనటుల పారితోషకం కూడా భారీగా పెరిగింది. హీరోలు ఒక్కో సినిమాకు సుమారు 30 నుంచి 40 కోట్ల వరకు తీసుకుంటున్నారు. హీరోయిన్లు సైతం 10 కోట్లు అందుకుంటున్నారు. తాజాగా వచ్చిన హీరోయిన్లు అయితే ఒక్క సినిమా హిట్ అయితే చాలు రెమ్యునరేషన్ భారీగా పెంచుతున్నారు. తాజాగా క్యూట్ బ్యూటీ నిధి అగర్వాల్ సైతం తన పారితోషకం భారీగానే పెంచింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ హీరో సినిమాతో జనాల ముందుకు వచ్చింది. కుర్ర హీరోతో జోడీ కట్టి అదుర్స్ అనిపించింది. నటన పరంగా, అందాల ఆరబోత పరంగా అందరినీ ఆకట్టుకుంది. వాస్తవానికి ఈ అమ్మడు సినిమా అవకాశాలు ఉన్నా.. లేకున్నా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు కైపెక్కిస్తుంది. అయితే ఇప్పటి వరకు సినిమాకు 50 లక్షల నుంచి 80 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న ఈ అమ్మడు.. తాజాగా వచ్చిన హీరో సినిమాకు భారీగా రెమ్యునరేషన్ పెంచిందట. అశోక్ గల్లాతో జోడీ కట్టేందుకు ఏకంగా కోటిన్నర తీసుకున్నట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఆయన మనువడు అశోక్ గల్ల హీరో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఈ కుర్ర హీరో నిధితో లిప్ లాక్ కూడా చేశాడు. కొత్త హీరో అయినా రొమాన్స్ బాగానే చేసింది. కొత్త హీరో.. రొమాన్స్ ఎక్కువ కావడంతో రెమ్యునరేషన్ కూడా బాగానే డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా నిధి అడిగిన దానికి ఓకే చెప్పారట. సినిమా పరిశ్రమలోకి వచ్చిన చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు కోటి రూపాయలు తీసుకుందట. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా మూవీ హరి హర వీరమల్లులో నటిస్తుంది.