అరెరే.. కృతిశెట్టి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?

ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో ఉప్పెనలా దూసుకుపోతుంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత కూడా మంచి ఆఫర్లు అందుకుంటుంది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరినీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ పాత్రలకు కూడా నేను రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే స్తోంది. ఇకపోతే ఉప్పెన సినిమా తర్వాత ఇటీవలే నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటించింది.

ఈ సినిమాలో ఏకంగా లిప్ లాక్ సీన్లలో కూడా నటించి ప్రేక్షకుల అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి ఖాతాలో మరో హిట్ చేరిపోయింది. ఇక ఇటీవల బంగార్రాజు అనే సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి శెట్టి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్, సుధీర్ బాబు, నితిన్ సరసన నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది కృతి శెట్టి. ఇకపోతే ఇటీవల ఇంటర్వ్యూకు హాజరైన కృతి శెట్టి తన ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయాన్ని చెప్పింది.

మీరు ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నారు అని అడగగా.. రామ్ చరణ్ అంటే నాకు ఎంతో ఇష్టం.. ఎందుకంటే నేను తెలుగు లో చూసిన మొదటి సినిమా రంగస్థలం. ఇక ఈ సినిమాలో చరణ్ నటన ఎంతో అద్భుతంగా ఉంది. తెగ నచ్చేసింది. అప్పటినుంచి ఆయన అంటే ఇష్టం పెరిగిపోయింది. ఇక ఎప్పటికైనా రామ్ చరణ్ తో సినిమా చేయాలన్నది నా కోరిక అంటూ మనసులో మాట బయట పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇప్పుడు ఎంతోమంది యువ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇక రానున్న రోజుల్లో రామ్ చరణ్ సరసన నటించే సినిమాలో ఛాన్స్ దక్కించుకునే అవకాశం కూడా లేకపోలేదు మరి .