బాలయ్య.. నువ్ గ్రేటయ్య.. అఖండ అదిరే రికార్డ్?

చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగ రాయాలన్నా మేమే అంటూ సింహా సినిమాలో డైలాగ్ చెబుతారు బాలకృష్ణ. ఆ సినిమాలో చెప్పిన డైలాగ్ ను ఇక ఇప్పుడు అఖండ సినిమాతో నిజం చేశారు అని చెప్పాలి. ఎందుకంటే కరోనా ఈ పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయడానికి అందరూ భయపడుతున్న సమయంలో బాలకృష్ణ భయం బెరుకు లేకుండా సినిమాను విడుదల చేశారు. ప్రేక్షకులు సినిమా థియేటర్కు వస్తారో రారో అనుకుంటున్న సమయంలో జాతరలా ప్రేక్షకులందరిని సినిమా థియేటర్ కు తరలి వచ్చేలా చేసి అఖండ సినిమాతో సెన్సేషన్ సృష్టించారు బాలకృష్ణ. ఒకవైపు ఏపీలో టికెట్ ధరల తగ్గింపు సమస్య వేధిస్తున్న అటు వసూళ్లలో మాత్రం బాలకృష్ణ అఖండ సినిమా ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోయింది.

 

ఇప్పుడు అరుదైన రికార్డు సాధించే దిశగా దూసుకుపోతుంది అఖండ సినిమా. ఒకవైపు సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ మరోవైపు కరోనా వైరస్ కేసులు లాంటి సమయంలో షూటింగ్ లే వాయిదా పడుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో సినిమా విడుదల చేయడం అంటే ఎంతో రిస్కుతో కూడుకున్న పని. కాని సినిమా బాగుండాలి కానీ ఇవన్నీ అడ్డురావు అని నిరూపించింది అఖండ సినిమా. బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అఖండమైన విజయం సాధించింది. ఇక కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు విదేశాల్లో కూడా భారీగా వసూళ్లు రాబట్టడంలో సక్సెస్ అయింది ఈ సినిమా. ఇకపోతే జనవరి 20 నాటికి అఖండ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి అవుతుంది.

అయితే 50 రోజులు పూర్తయిన తర్వాత కూడా ఇంకా 103 కేంద్రాలలో ఎంతో సక్సెస్ఫుల్గా నడుస్తోంది అఖండ సినిమా. ఇప్పుడు వరకు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాల పంట పండించింది ఈ సినిమా. గత పదేళ్లలో 50 రోజులు ఫుల్ గా పూర్తి చేసుకున్న పోస్టరు ఎక్కడ లేదు అని చెప్పాలి. బాహుబలి లాంటి సినిమా తర్వాత అర్థ శతదినోత్సవం జరుపుకున్న ఏకైక సినిమా బాలయ్య అఖండ అని చెప్పాలి. ఇలా బాలయ్య సినిమా సెన్సేషన్ రికార్డులు సృష్టిస్తూ ఉండటంతో అభిమానులందరూ మురిసిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా జై బాలయ్య అంటూ పోస్ట్ లు పెడుతూ ఉండటం గమనార్హం.