పుష్ప ఎఫెక్ట్‌..బ‌న్నీని దాంతో పోలుస్తూ నితిన్ షాకింగ్ ట్వీట్‌!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా మెర‌వ‌గా.. మ‌ల‌య‌ళ న‌టుడు ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 17న విడుద‌లై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ముఖ్యంగా ఈ చిత్రంలో పుష్ప రాజ్‌గా బ‌న్నీ త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపించి అద‌ర‌గొట్టేశాడు. మొత్తానికి మాస్ ప్రేక్ష‌కుల‌కు ఫుల్ మీల్స్ పెట్టేసిన పుష్ప‌.. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్లు రాబ‌డుతూ దూకుపోతోంది. తాజాగా పుష్ప మూవీని వీక్షించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్.. ఆపై ట్విట్ట‌ర్‌లో బన్నీని ఫైర్‌తో పోలుస్తూ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు.

`పుష్పలో అల్లు అర్జున్ డార్లింగ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. పుష్ప అంటే ఫైర్ కాదు.. అల్లు అర్జున్ అంటే ఫైర్. ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశాను. సుకుమార్, రష్మికా, దేవిశ్రీ ప్ర‌సాద్‌కి.. ఇంకా సినిమా టీమ్ మొత్తానికి అభినందనలు` అని పేర్కొంటూ బ‌న్నీ ను తను హగ్ చేసుకొన్న ఫోటోను షేర్ చేశాడు నితిన్. దీంతో ఈయ‌న పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

కాగా, నితిన్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల చెక్‌, మాస్ట్రో చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈయ‌న ప్ర‌స్తుతం `మాచర్ల నియోజకవర్గం` అనే చిత్రం చేస్తున్నాడు. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

https://twitter.com/actor_nithiin/status/1472608835818819586?s=20