కుర్రకారుకు బికినీ ట్రీట్ ఇస్తున్న స్యామ్.. ఫొటోస్ వైరల్..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తన భర్తతో విడాకులు ప్రకటించిన తర్వాత ఈమెకు వరుస అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓకే చెబుతూనే.. మరోపక్క కమర్షియల్ సినిమాలు కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా బికినీ వేసుకుని ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేయగా అవి కాస్త బాగా వైరల్ గా మారాయి.


అంతే కాదు ఆ ఫోటోలకు ఆమె గోవా యూ బ్యూటీ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించింది.ఈ ఫొటోని బట్టి అమ్మడు గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి, మోడల్ వాసుకి పుంజ్ కూడా ఉన్నారు. వీరందరూ కలిసి గోవాకి హాలిడేకు వెళ్లారు. చూస్తుంటే న్యూఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే ప్లాన్ చేసినట్లు ఉన్నారు. తన భర్తతో విడిపోయిన తరువాత సమంత ఎక్కువగా తన స్నేహితులతోనే సమయం గడుపుతోంది.

గతంలో ఇదే బ్యాచ్ తో కలిసి చార్ ధామ్ యాత్రకు వెళ్లింది సామ్. తన జీవితంలో వచ్చిన మార్పులను అడ్జస్ట్ చేసుకోవడానికి సమంత తనను తాను చాలా బిజీగా ఉంచుకుంటుంది. హాలిడే ట్రిప్ లు, సినిమాలంటూ గ్యాప్ లేకుండా గడుపుతోంది. రీసెంట్ గానే ‘శాకుంతలం’ సినిమా పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం ‘యశోద’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది.

https://www.instagram.com/p/CX-8_e6LoC3/?utm_source=ig_embed&ig_rid=7465b422-e04f-4fa3-bbc9-196ab6f482f3