భార్య‌, పిల్ల‌ల‌కు వ‌ర్మ దూరంగా ఉండ‌టానికి కార‌ణం ఏంటో తెలుసా?

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్‌ అడ్ర‌స్‌ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శివ` సినిమాతో డైరెక్ట‌ర్‌గా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వ‌ర్మ‌.. మొద‌టి సినిమాతోనే సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు. ఆ త‌ర్వాత ఎన్నో హిట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన‌ ఈయ‌న‌.. ప్ర‌స్తుతం ఎలా ప‌డితే అలా సినిమాలు తీస్తున్నాడు.

అలాగే ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు, వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడీయ‌న‌. ఇక రామ్ గోపాల్ వ‌ర్మ వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న సంప్రదాయమైన కుటుంబానికి చెందిన రత్న అనే మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంప‌తుల‌కు రేవతి అనే కుమార్తె ఉంది. ఆమె రష్యా లో ఎంబీబీఎస్ చదివించింది. ఆ స‌మ‌యంలోనే తోటి విద్యార్థుడు ప్రణవ్‌తో ప్రేమ‌లో ప‌డి.. ఆపై పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకుంది.

రామ్ గోపాల్ వర్మ కూతరు రేవతి, అల్లుడు ప్రణవ్ ప్ర‌స్తుతం డాక్ట‌ర్ వృత్తిలో కొన‌సాగుతున్నారు. అలాగే ఇటీవ‌ల రేవ‌తి పండంటి ఆడ‌బిడ్డ‌కు కూడా జ‌న్మ‌నిచ్చింది. అయితే ఇంత మంది ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఉన్నా వ‌ర్మ మాత్రం ఒంట‌రిగానే ఉంటాడు. ఇక ఈయ‌న అస‌లు ఫ్యామిలీకి దూరంగా ఉండ‌టానికి కారణం ఏంటీ..? అన్న సందేహం ఎంద‌రిలోనూ ఉంది.

ఈ విష‌యంపై గ‌తంలో వ‌ర్మ స్వ‌యంగా క్లారిటీ ఇచ్చారు. `పెళ్లి అయితే అర్ధంతరంగా జీవితం అయిపోయినట్టే. అంతేకాదు పెళ్లి అయిన తర్వాత భార్య, పిల్లలు, చదువు, ఉద్యోగం ఇదే జీవితం అయిపోతుంది. ఇక మన జీవితానికి అంటూ ఏమీ ఉండదు.. నేను ఆ బంధాలలో మునిగిపోదలుచుకోలేదు. కాబట్టి నాకు పెళ్లై, పిల్ల‌లు ఉన్నా కూడా వారికి దూరంగా ఉంటున్నాను..` అంటూ వ‌ర్మ చెప్పుకొచ్చాడు.