అన‌సూయ‌కు కోపం వ‌చ్చింది… వాళ్ల‌కు చుర‌క‌లు వేసిందిగా…!

హాట్ యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బుల్లితెర మీద ఆమె ఇప్పుడు నెంబర్ వన్ యాంకర్. ఆమె ప్రోగ్రామ్‌ వస్తుందంటే చాలు జనాలకు పెద్ద సంబరం. టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తుంటారు. అన‌స‌య షోల‌కు టీఆర్పీ రేటింగ్‌లు కూడా పేలిపోతూ ఉంటాయి. బుల్లితెరకు హాట్ ఇమేజ్ తేవటంలో అనసూయ ఎంత కీలకంగా నిలిచిందో తెలిసిందే. అసలు యాంకరింగ్ అనే పదాన్ని హాట్ హాట్ గా మార్చిన క్రేజ్ కూడా అనసూయదే. బుల్లి తెరపై తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న అనసూయకు సోషల్ మీడియాలో కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె వెండితెర మీద కూడా ఎంట్రీ ఇచ్చింది.

క్ష‌ణం – రంగస్థలం సినిమాల‌లో కీలక పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్న‌ర్ సినిమాలో తన పేరుమీద ఉన్న సూయా సూయా అన‌సూయ అనే పాపులర్ ఐటెం సాంగ్‌లో నటించింది. వెండితెర‌పై పాత్ర‌ల్లోనే కాదు.. ఐటెం సాంగ్‌ల్లో కూడా న‌టించి త‌గ్గేదేలే అని నిరూపించింది. ఇటీవల వచ్చిన అల్లు అర్జున్ సినిమా పుష్పలో దాక్షాయిని అనే పాత్రలో కనిపించింది. రెండో పార్టులో ఈ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని దర్శకుడు సుకుమార్ చెప్పిన సంగతి తెలిసిందే.

చాలామంది అన‌సూయ‌ను ఎప్పుడూ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. తనపై తరచూ జరిగే ట్రోలింగ్ కు ఘాటుగా కౌంటర్ లు ఇచ్చిన అనసూయ.. తాజాగా యూట్యూబ్ లో తనపై అసభ్యకరమైన థ‌మ్‌నెయిల్స్‌ పెడుతున్నారంటూ మండిపడింది. ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టే థ‌మ్‌నెయిల్స్ చూశానని ‘ అనసూయ చాలా లావు అయిపోయింది ‘ – ‘ అనసూయ ఎంత లావు అయిపోయిందో చూస్తే షాక్ అవుతారు ‘ ఇలాంటి చెత్త ఇమేజ్‌లు పెడుతున్నారని ఆమె మండిపడింది. ఇలాంటి విషయాలను పట్టించుకోకూడదు అని అనుకుంటా అని.. అయితే ఒక్కసారి ఎమోషనల్‌గా వీక్ గా ఉన్నప్పుడు స్పందించక త‌ప్ప‌డం లేదని అనసూయ చెప్పింది.

ఇక బరువు పెరగాలా లేదా త‌గ్గాలా అన్నది తన ఇష్టం చెప్పిన అనసూయ… కేవలం వ్యూస్‌ కోసం ఇత‌రుల క్యారెక్ట‌ర్‌ను కించ‌ప‌రిచే ఇమేజ్‌లు ఎలా ? పెడతారని మండిపడింది. తాను కూడా అలా మాట్లాడతానని… అయితే ఎదుటి వ్యక్తులని బాధ పెట్టడం తనకు ఇష్టం ఉండదని… అలాంటి వ్యక్తిత్వం తనది కాదని అనసూయ యూట్యూబ్ వాళ్లకు చురకలు అంటించింది.