బాలకృష్ణకు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. కారణం ఏంటో తెలియదు గానీ ఇప్పుడు బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా… సగటు సినిమా అభిమాని కూడా జై బాలయ్య నినాదం బోధిస్తున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత బాలయ్య నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇండస్ట్రీలో కొంతమంది హీరోల అభిమానులు బాలయ్య సినిమాలు పెద్దగా పట్టించుకోరు. పైగా బాలయ్య సినిమా వస్తుందంటే నెగిటివ్‌గా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అయితే అఖండ సినిమాకు మాత్రం అందరి హీరోల అభిమానులు సపోర్ట్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చి సంచలనం రేపాడు. ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్య ఎవ్వరూ ఊహించని విధంగా బుల్లితెర మీద కూడా ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అరవింద్ కు చెందిన ఆహా ఓటి డిజిటల్ ప్లాట్ ఫాం లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో ను హోస్ట్ చేస్తూ సూపర్ హిట్ చేసి పడేసారు. బాలయ్య ఒక టాక్ షోను ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఎపిసోడ్లు చూస్తున్న వారందరూ కూడా మెస్మరైజ్ అయిపోతున్నారు. బాలయ్యలో ఎప్పుడూ ఉండే జోష్‌కు తోడు.. ఎపిసోడ్ ప్లాన్ కూడా అదిరిపోయింది అని అంటున్నారు. ఇక గత కొన్ని దశాబ్దాలుగా జై బాలయ్య నినాదం ఎంత పవర్ఫుల్లో తెలిసిందే. బాలయ్య ఎక్కడికి వెళ్ళిన అభిమానులు ఆయనను ముద్దుగా జై బాలయ్య నినాదాలతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.
ఇటీవల అఖండ సినిమా సమయంలో ఈ స్లోగన్ బాగా పాపులర్ అయింది. అఖండ సినిమాలోనూ జై బాలయ్య పాట కూడా పెట్టారు. ఇది బాగా హైలెట్ అయ్యింది. తెలుగులో మాత్రమే కాదు … అటు అమెరికాలో, కర్ణాటకలో.. ఇప్పుడు తాజాగా తమిళనాడులోనూ జై బాలయ్య నినాదాలు మార్మోగుతున్నాయి. చెన్నైలో తాజాగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
తమిళ స్టార్ హీరోలు ఉదయనిధి స్టాలిన్, శివకార్తికేయన్ ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసారు.
శివ కార్తికేయ మాట్లాడుతూ ఉండగా స్పీచ్ మధ్యలో అభిమానులు జై బాలయ్య అంటూ పెద్దగా నినాదాలు చేశారు. దీంతో కార్తికేయ ఓకే గుడ్… అనడంతో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లేస్ ఏదైనా.. ఎక్కడైనా జై బాలయ్య పవర్ ఫుల్ అయిపోయింది.