ఇంకా త‌గ్గ‌ని `అఖండ` హ‌వా..18వ రోజు ఎంత వ‌సూల్ చేసిందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించగా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. ఇక భారీ అంచ‌నాలు న‌డుమ సెంబ‌ర్ 2న విడుద‌లైన సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

బాల‌య్య న‌ట‌నా విశ్వ‌రూపం, బోయ‌పాటి టేకింగ్‌, త‌మ‌న్ అందించిన మ్యూజిక్‌.. ఈ మూడు అంశాలే `అఖండ` సినిమా అఖండ విజంయ సాధించ‌డానికి ప్రధాన కార‌ణాలు అయ్యాయి. దీంతో విడుద‌లైన రోజు నుంచే బాక్సాఫీస్ వ‌ద్ద భారీ కలెక్షన్లను కొల్ల‌గొడుతూ లాభాల బాట ప‌ట్టిన అఖండ‌.. ఇప్ప‌టికీ హ‌వాను కొన‌సాగిస్తోంది.

ప్రేక్ష‌కుల‌కు ముందుకు వ‌చ్చిన 18 రోజులు గ‌డుస్తున్నా.. ఇంకా కొన్ని చోట్ల డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. అంతేకాదు, 17వ రోజు 46 ల‌క్ష‌ల షేర్ వ‌సూల్ చేసిన అఖండ.. 17వ రోజు ఏకంగా రు. 78 ల‌క్ష‌ల షేర్‌ను రాబ‌ట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మరి ఇంకెందుకు ఆల‌స్యం అఖండ‌ 17 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి..

అఖండ 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్:

నైజాం- 18.92 కోట్లు
సీడెడ్- 14.38 కోట్లు
ఉత్తరాంధ్ర- 5.85 కోట్లు
ఈస్ట్- 3.93 కోట్లు
వెస్ట్- 3.24 కోట్లు
గుంటూరు- 4.51 కోట్లు
కృష్ణా- 3.42 కోట్లు
నెల్లూరు- 2.48 కోట్లు
————————————————————————-
ఏపీ-తెలంగాణ టోటల్- 56.78 కోట్ల షేర్(93.20 కోట్లు- గ్రాస్‌)
————————————————————————–

క‌ర్నాట‌క + రెస్టాఫ్ ఇండియా – 4.70 కోట్లు
ఓవ‌ర్సీస్ – 5.34 కోట్లు
————————————————————————-
టోట‌ల్ వ‌రల్డ్ వైడ్ షేర్ = 66.82 కోట్లు(115.7 కోట్లు-గ్రాస్‌)
————————————————————————