ఎన్టీఆర్ చేతికి గాయం.. స‌ర్జ‌రీ పూర్తి..అస‌లేమైందంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేతికి గాయం అయింది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయ‌న కుడి చేతి వేలుకి తీవ్ర గాయం కాగా.. వెంట‌నే ఓ ప్రైవేటు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాయి. అక్క‌డ ఆయ‌నకు చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం.

నిన్న చెర్రీ.. నేడు తారక్.. ఏమైంది..? | Jr ntr suffers right hand wrist injury | TV9 Telugu

అయితే ఈ విషయం ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించ లేదు. కానీ నిన్న దీపావళి పండ‌గ సందర్భంగా తన కుమారులతో కలిసి ఒక ఫోటో ని ఎన్టీఆర్ షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఆయన చేతికి బ్యాండేజి లాగా కనిపించడంతో అభిమానులు అందరూ తెగ కంగారు పడ్డారు.

Has Jr NTR fractured his right hand? Here's what happened - Movies News

ఈ క్ర‌మంలోనే అస‌లు ఏం జ‌రిగిందా అని ఆరా తీయ‌గా.. ఎన్టీఆర్ చేతి గాయం విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని, ప్రస్తుతం ఆయ‌న బాగానే ఉన్నార‌ని స‌మాచంర‌. కాగా, ఎన్టీఆర్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసుకున్న ఆయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్నారు.

https://www.instagram.com/p/CV23QqXvuDm/?utm_source=ig_web_copy_link