శ్రుతి హాస‌న్ త‌ల్లి సారిక 6 రోజుల పాటు కారులోనే గ‌డిపార‌ని తెలుసా?!

November 23, 2021 at 2:40 pm

హీరోయిన్ సారిక ఈ పేరు చెప్పగానే అందరికి వెంటనే కమల హాసన్ గుర్తుకు వస్తారు. కానీ .. అందరికి తెలియని విషయం ఏమిటంటే కమల్ జీవితంలోకి రాకముందే సారిక నటిగా గొప్ప గుర్తింపు దక్కించుకుంది. ఇంకా చెప్పాలంటే ఆమె జీవితం మొదలైందే నటనతో. సారికా జీవితాన్ని సినిమాని విడివిడిగా చూడటం అసాధ్యం. ఎందుకంటే. ఆమెకి నడక వచ్చిన నాటి నుండే సారిక సినిమాలో నటించడం స్టార్ట్ చేసింది. ఆమెకి బడి అయినా, గుడైనా సినిమానే. సారిక చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రులు విడిపోయారు. నాలుగేళ్ల ప‌సి వ‌య‌సులోనే ఆమె ప‌నిచేయ‌డం ప్రారంభించింది. స్కూలుకు వెళ్ల‌డానికి బ‌దులుగా ఆమె ఫిల్మ్ స్టూడియోల చుట్టు చ‌క్క‌ర్లు కొడుతూ వ‌చ్చింది.

ఆ అవయసులో ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్లి నటించడం మాత్రం సారిక పని. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ బి.ఆర్‌. చోప్రా రూపొందించిన‌ ‘హ‌మ్‌రాజ్‌’ మూవీలో సారిక నటనా జీవితం మొదలయింది. అప్పుడు సారిక వయసు 4 సంవత్సరాలు మాత్రమే. సారిక చిన్న తనంలో అబ్బాయి పాత్ర‌లు ఎక్కువగా చేసింది. ఇలా నటిస్తూనే యవ్వనంలోకి వచ్చింది సారిక. అయినా.. తన తల్లి కోసం నటిస్తూనే వచ్చింది. కానీ.., సారిక అమాయకత్వాన్ని ఆమె తల్లితో సహా అందరూ వాడుకుని ఆమె సంపాదించిన సొమ్ముని అంతా కాజేశారు. దీంతో.. 21 సంవ‌త్స‌రాల యువ‌తిగా ఉండ‌గా సారిక తన తల్లి నుండి దూరంగా వచ్చేసింది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో సారిక చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఆమె దగ్గర ఒకే ఒక్క కారు ఉండేది. తినడానికి తిండి లేకుండా, ఒంటి మీద ఒకే ఒక్క జత బట్టలతో సారిక తన కారులో ఏకంగా 6 రోజుల పాటు అలాగే ఉండిపోయిందంటే సారిక ఎన్ని కష్టాలను పడిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇలా ఏ తోడు లేకుండా 7 ఏళ్ళ పాటు ఒంటిరిగా జీవిస్తూ వచ్చింది సారిక. అప్పుడు ఆమె జీవితంలోకి కమల్ ప్రవేశించాడు. క‌మ‌ల్ హాస‌న్‌ను సారిక ప్రేమించి పెళ్లాడింది. వీరికి శృతిహాసన్, కమల్ హాసన్ అని ఇద్దరు కుమార్తెలు జన్మించారు. జీవితంలో పడ్డ కష్టాలను చెడిపేస్తు దేవుడు తనకి ఒక అందమైన జీవితాన్ని ప్రసాదించాడు అని సారిక ఆనందపడే లోపే కమల్ తో సారిక విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. తరువాత సారిక 43ఏళ్ళ వయసులో ఇద్ద‌రు కూతుళ్లును వెంట పెట్టుకుని ముంబైకి వెళ్లిపోయింది సారిక. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏమిటో తెలుసా? అప్పటికి సారికకి అంటూ సొంత బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. పిల్లల పోషణ కోసం మళ్ళీ నటించడం మొదలు పెట్టింది. అట్లా రాహుల్ ధొలాకియా డైరెక్ష‌న్‌లో న‌టించిన ‘ప‌ర్జానియా’ మూవీలో న‌ట‌న‌కు గాను ఏకంగా ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును సాధించిందామె. నటిగా సారిక స్థాయి అది. చూశారు కదా? సారిక జీవితంలో ఎన్ని కష్టాలను పడిందో? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

శ్రుతి హాస‌న్ త‌ల్లి సారిక 6 రోజుల పాటు కారులోనే గ‌డిపార‌ని తెలుసా?!
0 votes, 0.00 avg. rating (0% score)