సంక్రాంతికి టాలీవుడ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా?

November 23, 2021 at 2:42 pm

సినిమా పరిశ్రమకు సంక్రాంతి అతి పెద్ద పండుగ. అందుకే ఈ సందర్భంగా బరిలో నిలిచేందుకు చాలా సినిమాలు పోటీ పడుతాయి. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగింది. పలు లోకల్ సినిమాలతో పాటు పాన్ ఇండియన్ సినిమాలు సైతం విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు ఏంటో తేలిపోయాయి. డేట్స్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల ఖరీదు ఏకంగా వెయ్యి కోట్లు అంటున్నారు సినీ ఎక్స్ పర్ట్స్. కరోనా లేకపోతే ఈ బిజినెస్ కాస్తా పెరిగే అవకాశం ఉండేది. ఇంతకీ ఏ సినిమా ఎంత బిజినెస్ చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ రెండు రాష్ట్రాల్లో కలుపుకుని 5 వందల కోట్ల బిజినెస్ చేసింది. అటు దేశ వ్యాప్తంగా హక్కులు, ఓవర్సీస్ బిజినెస్ అంతా కలుపుకుంటే వెయ్యి కోట్లు దాటినట్లు తెలుస్తోంది. దీంతో జనవరి 7న విడుదల అవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత రెండో స్థానంలో రాధేశ్యామ్ ఉంది. పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా సాహో తర్వాత మూడేళ్లకు రిలీజ్ అవుతుంది. అటు బాలీవుడ్ కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి కనబరుస్తోంది. జనవరి 12న ఈ సినిమా జనాల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3 వందల కోట్ల దాకా బిజినెస్ అయ్యింది. ప్రభాస్ హీరోయిజం కారణంగానే ఈ బిజినెస్ జరిగినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఈ రెండు సినిమాల తర్వాత మూడో సినిమాగా భారీ బిజినెస్ చేసిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా వంద కోట్లకు పైగా బిజినెస్ అందుకుంది. రీమేక్ సినిమా అయిన ఈ సినిమా మీద జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత బంగార్రాజు సినిమాకు బిజినెస్ బాగానే చేసింది. నాగార్జున మూలంగా ఈ సినిమాకు 50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి జనాలను బాగా ఆకట్టుకుంటుందనే ప్రచారం నడుస్తోంది. జనవరి 15న ఈ సినిమా విడుదల కానుంది.

సంక్రాంతికి టాలీవుడ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts