శ్యామ్ సింగ రాయ్.. నాని పాత్ర ఈరేంజ్‌లో ఉంటుందా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో నాని ఎలాగైనా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ‘వి’, టక్ జగదీష్ చిత్రాల ఫెయిల్యూర్‌తో డీలా పడ్డ నాని, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ‘శ్యామ్ సంగ రాయ్’ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నాని నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా నుండి ‘రైజ్ ఆఫ్ శ్యామ్ సింగ రాయ్’ అనే లిరికల్ పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లగా, మిక్కీ జె మేయర్ అదిరిపోయే బాణీలు సమకూర్చాడు. ఇక ఈ పాటను విశాల్ దడ్లాని, అనురాగ్ కుల్కర్ణి, సిజీ అదిరిపోయే రీతిలో ఆలపించడంతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

మొత్తానికి శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో నాని పాత్ర ఎలా ఉండబోతుందో ఈ పాటలో తెలియజేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా నేపథ్యంలో కోల్‌కతాలో ఉండనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమాలో నాని సరసన అందాల భామలు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.