చరణ్ హెయిర్ స్టైలిస్ట్ రెమ్యూనరేషన్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు?!

`ఆర్ఆర్ఆర్‌` చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మార‌బోతున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

Ram Charan's upcoming film with Shankar to be made in 3D format? - Movies News

ఇదిలా ఉంటే.. ఈ పాన్ ఇండియా చిత్రంలో చ‌ర‌ణ్ హెయిర్ స్టైల్ కోసం డైరెక్ట‌ర్‌ శంక‌ర్ ప్ర‌త్యేకంగా హెయిర్‌స్టైలిస్ట్‌ను ర‌ప్పించార‌ట‌. ముంబై నుండి హైద‌రాబాద్ కి వ‌చ్చే ఈ స్టైలిస్ట్ రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. అవును, స‌ద‌రు హెయిర్ స్టైలిస్ట్ రోజుకు రూ. 1.5 లక్షల రూపాయల్ని ఛార్జ్ చేస్తాడ‌ట‌.

RC 15: Shankar Who Spent The Poster In O Range .. What Will Be The Budget Of The Film ..?

పైగా స‌ద‌రు స్టైలిస్ట్ కు తోడుగా ముగ్గురు అసిస్టెంట్స్ ఉన్నారు. వాళ్లంద‌రికీ బిజినెస్ క్లాస్ టిక్కెట్లు, ఫైవ్ స్టార్ హోటల్ వసతి ఇవ‌న్నీ అద‌న‌పు ఖ‌ర్చు అవుతుంది.ఇక మొత్తం మీద‌ షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి కోటి రూపాయల వరకు వాళ్లు బిల్లు అవుతుంద‌ని స‌మాచారం. ఏదేమైనా హెయిర్ స్టైలిస్ట్‌కే ఇంత ఖ‌ర్చు పెడుతుండ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.