పెద్దన్న.. క్రేజే లేదన్న!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అన్నాతై’ దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. చాలా రోజుల తరువాత రజినీకాంత్ బొమ్మ వస్తుండటంతో తమిళ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఆయన సినిమాలను తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడం ఆనవాయతీగా వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రజినీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అన్నాతై’ని కూడా తెలుగులో ‘పెద్దన్న’ అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తిని క్రియేట్ చేయలేదనే విషయం నిజం. రజినీ సినిమా అంటే ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అవుతాయి. కానీ ‘పెద్దన్న’ సినిమా విషయంలో మాత్రం టాలీవుడ్ నాట ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. దీనికి ఏమిటా కారణమని వెతుకుతున్నారు చిత్ర విశ్లేషకులు. పెద్దన్న చిత్రంలో రజినీకాంత్ పర్ఫార్మెన్స్ చాలా పేలవంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లలో కనిపించింది.

దీంతో పెద్దన్న చిత్రంలో పసలేని కథ ఉంటుందని, అందుకే ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పలువురు సినీ క్రిటిక్స్ అంటున్నారు. అంతేగాక ఈ సినిమాలో రజినీ లుక్స్ పరంగా కూడా చాలా వీక్‌గా ఉండటంతో ఈ సినిమాలో ఆయన అభిమానులు ఆశించే అంశాలు పెద్దగా ఉండకపోవచ్చని వారు అంటున్నారు. అందుకే ఈ సినిమాపై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఎలాంటి భారీ అంచనాలు లేవనేది వాస్తవం. మరి దీపావళి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.