కాంగ్రెస్ కల నెరవేరేనా.. ప్రియాంక ప్లాన్ సఫలమయ్యేనా?

త్తర ప్రదేశ్ రాష్ట్రం.. దేశంలోనే అతిపెద్ద స్టేట్.. అధికారంలో ఉన్నది బీజేపీ.. సీఎం సీటులో కూర్చుంది యోగి ఆదిత్యనాథ్.. కరుడుగట్టిన హిందూత్వవాది.. ఇదీ అక్కడి పరిస్థితి.. మరి వచ్చే ఎన్నికల్లో.. అనే ప్రశ్న అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న. అలాంటి ప్రశ్నలకు చోటు లేదు.. వచ్చేది మేమే అని బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. వీరి మాటలు నిజమేనేమో అన్నట్లు సీ ఓట్ సర్వే కూడా కమలం పార్టీదే మళ్లీ యూపీ అని చెబుతోంది.. దీంతో బీజేపీలో ఉత్సాహం నెలకొనగా కాంగ్రెస్లో మాత్రం కాస్త అయోమయం నెలకొంది. అయ్యో.. అలాంటిదేం లేదు.. గెలిచేది మనమే అని కాంగ్రెస్ నాయకులు కిందిస్థాయి కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తున్నారు.

ఇక ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ బాధ్యతలు మోస్తున్నది ఎవరో తెలుసు కదా.. మాజీ ప్రధాన మంత్రి మనవరావు.. మాజీ ప్రధాని కూతురు అయిన ప్రియాంక గాంధీ .. ఎలాగైనా యూపీలో పార్టీకి అధికార పగ్గాలు కట్టబెట్టాలనేది ఆమె ప్లాన్.. ఆమెదే కాదు.. అందరిదీ.. యూపీలో ప్రియాంక సక్సెస్ అయితే.. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి నేత దొరికినట్లే. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆశలకు అనుగుణంగా ప్రియాంక యూపీలో రాజకీయంగా చురుగ్గా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 403 స్థానాల్లోనూ పోటీచేస్తందని చెప్పేశారు. దీంతో తమ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి ఎవరూ ప్రయత్నించవద్దని పరోక్షంగా చెప్పేశారు. సీ ఓటర్ సర్వేలో.. బీజేపీ అధికారంలోకి వస్తుంది అయినా.. దాదాపు 100 సీట్లు తగ్గుతాయని తేలింది. అంటే తగ్గే 100 సీట్లు తమ ఖాతాలో చేరుతాయని ప్రియాంక భావన. దీనికి ఇంకొంచెం కష్టపడితే.. యోగి ఆదిత్యనాథ్ నిర్లక్ష్య ధోరణిని జనంలోకి బలంగా తీసుకువెళితే మాత్రం కచ్చితంగా విజయం సాధిస్తామని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కొద్దికాలం వేచిచూడాల్సిందే.