కాబోయే భార్య‌కు కార్తికేయ రొమాంటిక్‌ ప్రపోజ‌ల్‌..వీడియో వైర‌ల్‌!

ఆర్ఎక్స్ 100 సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో కార్తికేయ‌.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెస్ట్ ఫ్రెండ్‌, ప్రియురాలు లోహితతో ఆయన నిశ్చితార్థం ఘ‌నంగా జరిగింది.

Kartikeya Gummakonda gets engaged to Lohitha Reddy, see pics | Entertainment News,The Indian Express

అయితే తాజాగా జ‌రిగిన `రాజా విక్రమార్క` సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ..`నా జీవితంలో హీరో కావడానికి ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి ఓ అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నా. అప్పుడే తనకి ‘నేను హీరో అవుదామని అనుకుంటున్నా, అయ్యాక మీ ఇంట్లో వచ్చి అడుగుతా’నని చెప్పా. నేను హీరో అయ్యి… చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా. ఈ నెల 21న నా పెళ్లి` అంటూ త‌న‌కు కాబోయే భార్య లోహిత‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేశాడు.

Hero Kartikeya Surprises Fiancee On Stage -

ఆమె నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, కార్తికేయ లోహిత‌కు స్టేజ్‌పై అంద‌రి ముందూ రొమాంటిక్‌గా ప్ర‌పోజ్ కూడా చేశాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, కార్తికేయ తాజా చిత్ర‌మే `రాజా విక్రమార్క`. సాయి శ్రీపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ న‌వంబ‌ర్ 12న విడుద‌ల కానుంది.